Woman gangraped at her birthday party in Gurgaon, six held: Police

Six nepalese men held for raping woman in gurgaon guesthouse

gangrape, woman gangrape,birthday party rape, delhi news, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

The woman, who works as a domestic help, had come to the guest house to celebrate her birthday

పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుందామని.. గ్యాంగ్ రేప్

Posted: 10/17/2015 02:01 PM IST
Six nepalese men held for raping woman in gurgaon guesthouse

మగువలను ఎన్ని రకాలుగా మోసం చేయాలో తెలిసిన పైశాచిక మృగాలు.. ప్రతినిత్యం నూతన విధంగా వారిని నమ్మించి, మోసగిస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే వున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ యువతి జన్మదిన వేడుకలను సంబరంగా జరుపుకుందామని చెప్పి నమ్మబలికి.. అమెతో పాటు అమె స్నేహితురాళ్లలపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వంతుల వారీగా మార్చి మార్చి వారిపై అత్యాచారాలకు తెగబడిన ఆరుగురు మగ మృగాళ్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే..  హర్యానాలోని గుర్గావ్ నగరపరిథిలోని డిఎల్ఎఫ్ ఫేస్ టు క్వార్టర్ లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ యువతి జన్మదినాన్ని పురస్కరించుకుని.. చాలా బాగా సెలబ్రేట్ చేద్దామని నమ్మించిన ఓ యువకుడు స్థానికంగా వున్న ఓ గెస్ట్ హౌస్ కు అమెను తీసుకెళ్లాడు. ఒంటరిగా వెళ్లడం ఇష్టంలేని ఆ యువతి తోడుగా మరో యువతిని వెంటబెట్టుకుని వెళ్లింది. అయితే వీరి గెస్ట్ హౌస్ లోకి వెళ్లగానే కొద్ది సేపటికీ ఐదుగురు నేపాలీ యువకులు అక్కడి వచ్చారు. పుట్టినరోజు పార్టీ అని చెప్పి పీకల దాక ఫూటుగా మందుకోట్టారు.

మద్యం మత్తులో పార్టీలో వున్న ఇద్దరు యువతులతో అసభ్యంగా ప్రపర్తించడం ప్రారంభించారు. కామవాంఛతో తమపై తోడేళ్లు మీదపడుతున్నాయని గ్రహించిన ఇద్దరు యువతలు ఎంత నిలువరించేందుకు ప్రయత్నించినా..  ఫలితం లేకుండా పోయింది. ఆరుగురు వంతుల వారీగా ఇద్దరు అభాగినులపై సామూహికంగా అత్యచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అందరికీ పంపుతామని కూడా హెచ్చరించారు.

అయితే ఆ పార్టీ నుంచి చాకచక్యంగా తప్పించుకున్న యువతి స్నేహితురాలు పరుగుపరుగున వెళ్లి విషయాన్ని పోలీసులకు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితులపై 323, 342, 506, 376డి, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ పంపారు. ఇద్దరు యువతులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిందారు. ఈ ఘటనపై పోలీసులు గెస్ట్ హౌస్ లో పనులు చేస్తున్న కార్మికులను ప్రశ్నించడంతో పాటు సిసిటీవీ ఫూటేజీని కూడా పరిశీలిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gangrape  woman  guesthouse  birthday party rape  nepalise  arrest  

Other Articles