2 minors gang-raped in different localities of Delhi, both 'critical'

Capital shame toddler 5 year old girl gang raped in indian capital

Delhi rape,Minor rape,crime against children, delhi news, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

A week after the horrific rape and torture of a four-year-old girl in Delhi, two more cases of young girls being gang-raped have been reported from the capital. Both the girls have suffered severe injuries and are recovering in hospital.

ITEMVIDEOS: దేశ రాజధానిలో దారుణం.. ఇద్దరు చిన్నారులపై సామూహిక అత్యాచరం

Posted: 10/17/2015 02:04 PM IST
Capital shame toddler 5 year old girl gang raped in indian capital

దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనలు దేశ రాజధానిలో వరుసగా జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన గ్యాంగ్ రేప్ ను మరువక ముందే.. నిన్న ఒకే రోజున ఢిల్లీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు చిన్నారులపై సామూహిక లైంగిక దాడి ఘటనలు జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులపై సామూహిక అత్యాచారాలు జరిగాయి. తీవ్ర గాయాలతో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రులలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం పలువురిని ఆవేదనకు గురిచేసింది.

పశ్చిమ ఢిల్లీలో ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నర ఏళ్ల పసిపాపను అపహరించిన దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె ఇంటి సమీపంలోని పార్కు దగ్గర తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ చిన్నారిని ఇరుగుపొరుగు వారు  గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాపపై  అమానుషంగా అత్యాచారం చేశారని వైద్యులు తెలిపారు. చిన్నారికి  శస్త్రచికిత్స  చేశామని, పాప పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.

కాగా మరో దారుణం ఘటన తూర్పు ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో జరిగింది. ఐదేళ్ల పాపపై అఘాయిత్యం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పాపను, పొరుగున ఉండే వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావంతో నిందితుడి ఇంటి నుంచి ఏడుస్తూ వస్తుండగా పొరుగువారు గుర్తించి సోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ కేసులో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దేశరాజధాని ఢిల్లీలో చిన్నారులపై అత్యాచారాలు తరచూ జరుగుతుండటం సిగ్గుచేటని అన్నారు. సామూహిక అత్యాచారానికి గురై ప్రస్తుతం జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాళ్లను ఆయన పరామర్శించారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా ఆయన వెంట వచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు, ప్రధాని నరేంద్ర మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ లపై కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆడపిల్లలను కాపాడుకోవటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రధాని, లెఫ్టినెంట్ గవర్నర్ లు ఏం చేస్తున్నట్లు?' అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఢిల్లీలో పోలీసులపై పెత్తనం కేంద్రం చేతుల్లో ఉండటం వల్లే తాము అనుకున్న రీతిలో దుండగులను దండించే వీలు లేకుండా పోతోందని కేజ్రీవాల్ గతంలోనూ చాలాసార్లు చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దేశ పర్యటనకు వచ్చిన సమయంలో తాజ్ మహాల్ ను కూడా పర్యటిస్తారని అడుగడునా ఏర్పాటు చేసిన సిసిటీవీలను.. ఢిల్లీలోని పార్కు స్థలాలు, నిర్జన ప్రదేశాలు. జనసాంధ్రత కలిగిన ప్రాంతాలో.. వీధుల్లో ఏర్పాటు చేసి.. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నిత్య పర్యవేక్షణను ఏర్పాటు చేస్తే.. ఆడవారు, పసిపిల్లలు, యువతులపై అత్యాచారాలను కొంతవరకైనా నిలువరించవచ్చుకదా అని కూడా పలువరు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. అవినీతి లేని దేశం కన్నా.. అత్యాచారాలు లేని దేశంగా భారత్ తీర్చిదిద్దాల్సిన అవశ్యకత ప్రధానంగా వుందని కూడా విమర్శలు వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minor girls  gang rape  Delhi rape  crime against children  New Delhi  

Other Articles