Anonymous letter threatens to kill Anna Hazare

Anna hazare receives anonymous threat letter

Anna Hazare on reservation, Anna Hazare receives threat letter, Anna Hazare anonymous threat letter, Anna Hazare sikar, Anna Hazare rajasthan, Anna Hazare, Sikar, Social activist, Threat letter, rajasthan, Sikar Additional SP Prakash Kumar

Social activist Anna Hazare on Saturday received an anonymous threat letter in Sikar following which his security has been enhanced as a precautionary measure, police said.

సామాజిక కార్యకర్తకు మరోమారు బెదిరింపు లేఖ.. భద్రత పెంపు

Posted: 10/11/2015 01:44 PM IST
Anna hazare receives anonymous threat letter

రిజర్వేషన్లు ఇక అవసరం లేదని.. రిజర్వేషన్లను ఆపేయాల్సిన తరుణం ఇక ఆసన్నమైందని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు. ఎన్నికల్లో పార్టీల చిహ్నాల కంటే వ్యక్తుల పేర్లకే ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌లోని శిఖర్‌ వచ్చిన అన్నా హజారేను చంపేస్తామని బెదిరింపు లేఖ రావడంతో ఆయన భద్రతను మరింత పటిష్టం చేశారు. రాజస్థాన్‌లోని శిఖర్‌ నగరం వచ్చిన అన్నా.. స్థానికంగా బస చేసిన నివాసం ముందు ఓ అగంతకుడు స్కూటర్ పై వచ్చి ఈ బెదిరింపు లేఖను అక్కడ వేసి వెళ్లాడని శిఖర్ అడిషనల్ ఎస్పీ ప్రకాష్ కుమార్ అన్నారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో అన్నాకు భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. అయితే ఇది అకతాయిల పని కూడా కావచ్చని అభిప్రాయపడ్డారు.

కాగా శిఖర్ లో  మీడియాతో మాట్లాడిన అన్నాహజారే.. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు ఇంకా కొనసాగించడం మంచిదికాదని ఆయన అన్నారు. రిజర్వేషన్లకోసం జనం ఘర్షణలు పడే పరిస్థితి రావడం అన్యాయమని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొంత కాలం రిజర్వేషన్‌ అవసరమైందని, ఇప్పుడు రిజర్వేషన్లలో రాజకీయాలు వచ్చేశాయని, పార్టీలు తమ ప్రయోజనం కోసం రిజర్వేషన్లను వాడుకుంటున్నాయని.. ఇలా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తోందని ఆయన అన్నారు.

దేశంలో ఎన్నికల సంస్కరణలు అవసరమని, ఎన్నికల చిహ్నాలు వాడాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. అభ్యర్థి ఫోటో, పేరు ఉంటే చాలునని హజారే చెప్పారు. దీనిపై ప్రజా చైతన్యం అవసరమని ఉద్యమాన్ని శిఖర్‌ నగర్‌ నుంచి ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. మేము ప్రభుత్వంపై పోరాటం చేయడంలేదని, ప్రతిపక్షంతో చర్చలు అవసరం లేదని, ఎన్నికల సంఘంపై పోరాటం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు అన్నా హజారేను చంపుతామని ఒక బెదిరింపు లేఖ అందింది. ఆస్పత్రి వద్ద నడిచి వెళుతున్న అన్నా అభిమానికి ద్విచక్రవాహనంలో వచ్చిన ఒక వ్యక్తి బెదిరింపు లేఖ ఇచ్చి వెళ్లాడు. అన్నా విదేశీ ఎజెంట్‌ అంటూ ఆ లేఖలో ఆరోపించారు. ఈసారి తప్పించుకుంటే మరోసారి వచ్చినప్పుడు చంపుతామని ఆ లేఖలో పేర్కొన్నారు. బెదిరింపు లేఖ రావడంతో అన్నాకు భద్రతను పటిష్టం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anna Hazare  Sikar  Social activist  Threat letter  rajasthan  

Other Articles