India VS South Africa 1st ODI AB de Villiers special steers South Africa to a record 303/5

De villiers century takes south africa to 303 5 vs india

live cricket score, live score, india vs south africa, ind vs sa, india vs south africa live, ind vs sa live, india vs sa live score, india vs sa odi, india vs south africa odi score, ind vs sa score, india vs south africa score, live score ind vs sa, india south africa, india vs south africa series, india vs south africa tickets, cricket score live, cricket news, cricket

Captain AB de Villers completed a spectacular century with a six off the final ball of the innings to lead South Africa to a record 303 for five in the opening cricket One-day International against India

డెవిలియర్స్ వీరవిహారం.. భారత్ ముందు 304 పరుగుల లక్ష్యం..

Posted: 10/11/2015 01:40 PM IST
De villiers century takes south africa to 303 5 vs india

టీ-20 పొట్టి ఫార్మాట్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన టీమిండియాకు తొలివన్డేలో సఫారీలు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. కాన్పూరులో ఈ ఉదయం ప్రారంభమైన తొలి వన్డేలో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. 40 ఓవర్ల వరకు మందకొడిగా సాగిన సఫారీల బ్యాటింగ్‌ తర్వాత వేగం పుంజుకుంది. జట్టు స్కోరు 200 దాటిన తర్వాత డివిలియర్స్‌ రెచ్చిపోయాడు. 43 ఓవర్లలో 58 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్న డివిలియర్స్‌ మరో 7 ఓవర్లు ముగిసే సరికి 104 పరుగులకు చేరుకున్నాడంటే ఎంతలా వీరవిహారం చేశాడో అర్థం చేసుకోవచ్చు.

 సిక్సర్లు, ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించిన డివిలియర్స్‌ 73 బంతుల్లోనే 104 పరుగులు చేసి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక డేవిడ్‌ మిల్లర్‌(13), జేపీ డుమిని(15) పరుగులు చేసి వెనుదిరిగారు. తర్వాత బరిలోకి దిగిన బెహ్రదీన్‌(35) కెప్టెన్‌కు మంచి సహకారం అందించాడు. దీంతో 50 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి భారత్‌ ముందు 304 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  team india  south africa  ind vs south africa  ab de villers  

Other Articles