Narendra Modi weakening farmers to get their lands: Rahul Gandhi

Rahul on padayatra meets farmers k taka announces relief packages

Rahul gandhi karnataka padayatra, rahul gandhi meets karnataka farmers; rahul gandhi, padayatra, farmers, relief package, Siddaramaiah, Karnataka chief minister, karnataka government, karnatakaK'taka announces relief packages

Over 500 farmer suicides have been reported in the state since April this year, prompting the government to unveil a relief package for farmers

రాహుల్ రాకతో.. ఆగిన రైతుల కన్నీళ్లు.. వరాలు కురిపించిన ప్రభుత్వం

Posted: 10/11/2015 01:48 PM IST
Rahul on padayatra meets farmers k taka announces relief packages

కర్ణాటకలో అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతు కుటుంబాలు, అన్నదాతలను కోల్పయి అనాధగా మారి కడు దు:ఖంలో వున్న బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పర్యటన కన్నీళ్లను తుడిచింది. రాహుల్ కర్ణాటకలో నిర్వహిచిన పాదయాత్ర నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రైతులను కనుకరిస్తూ.. వారికి ఉపశమనం కలిగించేలా చర్యలను తీసుకుంది. రాష్ట్రంలో 541 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అన్నదాతపై ప్రభుత్వం అనుగ్రహం కురిపించింది.  రాహుల్‌గాంధీ సూచన మేరకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య రైతులకు పలు వరాలు ప్రకటించారు.

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామని, ఉచిత బీమా వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల పిల్లలకు పీజీదాకా ప్రభుత్వ ఖర్చుతో విద్యనందిస్తామన్నారు. రైతు వితంతువులకు నెలకు రూ.2వేలు పింఛన్‌ ఇస్తామన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీల ఆత్మహత్యకూ పరిహారం వర్తిస్తుందని చెప్పారు. అలాగే సహకార బ్యాంకులు ఇచ్చిన పంటరుణాలపై ఈ ఏడాది వడ్డీ, అపరాధ వడ్డీలను మాఫీ చేస్తున్నామని, ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని చెప్పారు. రుణాల రీ-షెడ్యూల్‌తోపాటు వసూళ్లను ఏడాదిపాటు వాయిదా వేయాలని బ్యాంకులను కోరామన్నారు. రైతులను పీల్చిపిప్పిచేస్తున్న 568 మంది వడ్డీ వ్యాపారులను అరెస్ట్‌ చేసి, 1300 కేసులు నమోదు చేశామని, వారిచ్చిన రుణాలనూ మాఫీచేసేందుకు యత్నిస్తామని చెప్పారు.

ఆత్మహత్యల్లో రైతులు.. సెల్ఫీ మోజులో ప్రధాని: రాహుల్‌

కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండ నిలుస్తాయని, ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు వద్దని రాహుల్‌గాంధీ భరోసా ఇచ్చారు. రాణిబెణ్ణూరు నుంచి గుడుగూర్‌ వరకు పాదయాత్రగా సాగిన ఆయన, మైదూరులో ఆత్మహత్య చేసుకున్న అశోక్‌ మడివాళ ఇంటికి వెళ్లి అతడి కుటుంబీకులను పరామర్శించారు. అశోక్‌ కుమారుడు కిరణ్‌కు ప్రభుత్వోద్యోగం ఇప్పించాలని సీఎంకు సూచించారు. కేపీసీసీ తరఫున వారికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. గుడుగూర్‌ బహిరంగసభలో మాట్లాడుతూ- రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రధాని మోదీ ఏ మాత్రం బాధ్యత లేకుండా ఏదో ఒక దేశానికి వెళ్లి, బడా పారిశ్రామిక వేత్తలతో సెల్ఫీలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. రైతులతో ఒక్కటంటే ఒక్క ఫొటో తీసుకున్న సందర్భమే లేదన్నారు. కూలీలు, కార్మికులు, రైతులంటే మోదీకి కంపరం కాబట్టే ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. తన ‘మన్‌ కీ బాత్‌’ వినిపించడం కాకుండా రైతులు, కూలీల మన్‌ కీ బాత్‌ను కొద్దిసేపయినా వినాలన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  padayatra  farmers  relief package  Siddaramaiah  Karnataka  

Other Articles