Sushil Koirala to ask President to start process to elect new PM

Nepal pm sushil koirala announces his resignation in parliament

prime minister Sushil Koirala resigns, Kathmandu, Nepal, Congress, Parliament, Nepal, PM Sushil Koirala, President Ram Baran Yadav, resignation, nepal india, nepal trade blockade, nepal india goods, nepal protest, nepal constitution, nepal new constitution, nepal violence, india nepal ties, indo nepal ties, k p oli, sushma swaraj, ministry of external affairs, vikas swarup

Nepalese Prime Minister Sushil Koirala on Friday said he would ask President to initiate a process to elect a new premier, as he invited the agitating parties for talks on issues surrounding the new constitution.

నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సుశీల్ కుమార్ కోయిరాలా

Posted: 10/02/2015 08:09 PM IST
Nepal pm sushil koirala announces his resignation in parliament

నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా ప్రధాని మంత్రి పదవికి రాజీనామా సమర్పించారంచారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఆ దేశ పార్లమెంట్లోనే ప్రకటించేశారు. రాష్ట్రపతి రామ్ బరన్ యాదవ్కి తన రాజీనామా లేఖను సుశీల్ కొయిరాలా అందజేశారు. నేపాల్ రాజ్యంగంలో మార్పులు చేర్పులు కోరుతూ పలు వర్గాలకు చెందిన ప్రజలు గత కొంత కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సుశీల్ కోయిరాలా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 20న ఆ దేశం కొత్త రాజ్యాంగాన్ని అమలు చేసిన విషయం విదితమే.

ఈ నేపథ్యంలో నూతన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను ఎన్నుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి పార్లమెంట్ సమావేశంలో పేర్కొన్నారు. తన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం, నూతన ప్రధానిని ఎన్నుకోవడానికి సన్నద్ధమవ్వాలని మంత్రి లాల్ బాబు పండిత్ అన్నారు. సమావేశాలు ప్రారంభమైన వారం రోజుల్లోగా ప్రధాని నియామకం, 20 రోజుల్లోగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉపరాష్ట్రపతి నియామకాలు జరగాల్సి ఉందన్నారు. కాగా, కోయిరాలా ఆధ్వర్యంలోని నేపాల్ ప్రభుత్వం గతేడాది భూకంపం సంభవించిన సమయంలో ఎంతో ఆత్మస్థైర్యం ప్రదర్శించింది. ప్రపంచ దేశాల సాయంతో అతలాకుతలమైన నేపాల్ ను పునర్నిర్మించిన సంగతి తెలిసిందే.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nepal  PM Sushil Koirala  President Ram Baran Yadav  resignation  

Other Articles