No differences between me and Harish says KTR

I and harish will compete only in one aspect says ktr

I and Harish will compete only in one aspect says KTR, No differences between me and Harish says KTR, telangana minister KTR, KTR accepts competitiveness with Harish Rao, constituency development aspect, no differences between me and harish,

telangana minister KTR accepts competitiveness with colleague minister Harish Rao only in constituency development aspect and clarifies that there are no differences between them

హరీష్ కు నాకు మధ్యన పోటీ వుంది...స్పష్టం చేసిన కేటీఆర్

Posted: 10/02/2015 08:13 PM IST
I and harish will compete only in one aspect says ktr

‘నేను, హరీష్ రావు పోటీ పడేది కేవలం నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో మాత్రమే’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరోగ్యకరమైన పోటీ ఉండటంలో ఎటువంటి తప్పు లేదన్నారు. తనకు, మంత్రి  హరీష్ కు మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. రాజకీయాల్లో మాత్రం తమ మధ్య ఎటువంటి పోటీలేదని ఆయన స్పష్టం చేశారు. తామిద్దరం కూడా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నామని, భవిష్యత్ లో కూడా పనిచేస్తామని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.

కాగా, వాటర్ గ్రిడ్ పై వస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని కేటీఆర్ కొట్టిపారేశారు. వరంగల్ లో జరిగిన ఎన్ కౌంటర్ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పోలీసుల విధి నిర్వహణలో భాగంగానే వరంగల్ ఎన్ కౌంటర్ జరిగిందని కేటీఆర్ అన్నారు. ఇక ఇటీవల నిర్వహించిన శాసనసభా సమావేశాలలో విపక్షాలన్నీ మాటలకు, అధికార పక్షంపై విమర్శలకే పరిమితమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. జానారెడ్డి జానెడు సలహా కూడా ఇవ్వలేదని, చిన్నారెడ్డి చిన్నా సూచన కూడా చేయలని కేటీఆర్ దుయ్యబట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : constituency development  no differences  KTR  Harish Rao  

Other Articles