Chris Harper Mercer's Motive Revealed? Umpqua Shooter Asked For Victims' Religion Before Gunfire, Witness Says

Chris harper mercer umpqua community college shooter identified

Chris Harper Mercer, oregon, ucc, umpqua, shooting, community college, mass shooting, religion, muslim, religiously motivated, college shootings, killing, christian, Roseburg, Oregon, Umpqua Community College

Chris Harper Mercer, the 26-year-old shooter who killed at least 1o people and wounded seven others at a community college in Roseburg, Oregon. The suspect, who was later killed by police, reportedly asked about people's religion before opening fire at Umpqua Community College, one witness said.

ITEMVIDEOS: సెకండులో దేవుడిని చూసిస్తా.. చూస్తావా నయానా..? అంటూ...

Posted: 10/02/2015 07:06 PM IST
Chris harper mercer umpqua community college shooter identified

ఒక్క సెకండులో దేవుడిని చూసిస్తా.. చూస్తావా నయానా..? అంటూ...అమెరికా ఒరెగాన్ రోజ్‌బర్గ్‌లో ఉన్న కాలేజీలో క్రిస్టియన్లు ఎవరని అడిగి మరీ కాల్చి చంపాడు ఓ ఉన్మాది. సుమారు పది మంది విద్యార్ధుల మరణానికి కారణమవ్వడంతో పాటు.. మరో  మంది విద్యార్థులు క్షతగాత్రులు అవ్వడానికి కారణంగా నిలిచిన క్రిస్ హార్పర్‌ అనే ఉన్మాది.. చివరకు పోలీసుల తూటాలకు బలయ్యాడు. ఓ చిన్న సైజు యుద్ధం చేయగలిగేందుకు వీలుగా భారీ సాయుధుడై కాలేజీ క్లాస్ రూంలోకి వచ్చిన హార్పర్ ఈ అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నానంటూ ప్రొఫెసర్‌ను తొలుత కాల్చి చంపాడు. ఆ తర్వాత విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ విద్యార్ధులను భయభ్రాంతులను చేశాడు.

క్రిస్టియన్లా కాదా అని అడిగి మరీ కాల్చి చంపాడు. ఒక్క సెకండ్‌లో దేవుణ్ఱి చూపిస్తానంటూ కాల్పులు జరిపాడు. సమాచారం అందుకుని రంగప్రవేశం చసిన పోలీసులు చివరకు హార్పర్‌ను కాల్చి చంపారు. లేకపోతే ఉన్మాది చేతిలో మరింత మంది అమాయక విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయేవారు. 26 ఏళ్ల హార్పర్ బ్రిటన్‌లో పుట్టి అమెరికాలో పెరిగాడు. కుమారుడి ఘాతుకంపై అతడి తండ్రి ఇయాన్ మెర్సెర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. హార్పర్‌కు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు బయటపెట్టడం లేదు. అమెరికాలో తుపాకుల వినియోగంపై చట్టాలు సరిగా లేకపోవడంతో అమాయకులు పిట్టల్లా రాలిపోతున్నారన్న విమర్శలు ఘటనలు జరిగిన ప్రతీసారి వినబడుతూనే వున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Umpqua Community College  Chris Harper Mercer  oregon  mass shooting  

Other Articles