2-year-old boy booked for theft

2 year old theif in uttar pradesh police register fir

father surrenders 2 years old boy in court,, 2 year old thief, 2 year old booked in dacoity case, up police book 2 yr old in theft case, sadarpur police, Bajehra village, Sadarpur area, boy's name removed during investigation, burglary case, up police

An FIR has been lodged against a two-year-old boy with three others in a theft case by Sadarpur police of the district.

పోలీసులా.. మజాకా.. రెండేళ్ల చిన్నారిపై దోంగతనం కేసు..!

Posted: 10/01/2015 07:08 PM IST
2 year old theif in uttar pradesh police register fir

చదవేస్తే ఉన్నమతి పోయినట్లుందన్న నానుడి ఉత్తరప్రదేశ్ పోలీసుల విషయంలో నిజమైయ్యింది. ఎందుకంటే నిందితులకు బంధువని.. ఏకంగా రెండేళ్ల బాలుడిపై చోరి కేసు పెట్టడమే ఇందుకు కారణం. ఎఫ్ఐఆర్లో పేరుందన్న కారణంగా  రెండేళ్ల అబ్బాయిపై దోపిడీ కేసు నమోదు చేసి విమర్శలు ఎదుర్కోన్నారు ఉత్తర్ ప్రదేశ్ లోని సర్థార్ పూర్ పోలీసులు. అంతేకాదు.. అసలు ఫిర్యాదులో ఏముందో చూసుకోకుండా, ఆ పిల్లాడిని అరెస్టు చేసేందుకు అతడి ఇంటికి కూడా వెళ్లారు. తన కుమారుడిని పోలీసులకు అప్పగించేందుకు మొరాయించి.. చివరకు ప్రాధేయపడటంతో.. పోలీసుల అదేశాల నేపథ్యంలో పిల్లాడిని మరుసటి రోజున కోర్టు ఎదుట హాజరపర్చేందుకు తీసుకురావడంతో విషయం బయటకు తెలిసింది. పిల్లాడి  తండ్రితో పాటు అయన తరుపు న్యాయవాదులు వెళ్లి జిల్లా ఉన్నతాధికారులను కలవడంలో ఎఫ్ఐఆర్ నుంచి పిల్లాడి పేరు తీసేస్తామని చెబుతున్నారు.

విషయం ఏమిటంటే.. యూపీలోని బజేరా గ్రామానికి చెందిన అమిత్ కుమార్, అతడి ఇంటి ఇరుగుపొరుగువాళ్లు కలిసి కొందరు ఓ దోపిడీ దొంగను పట్టుకున్నారు. అతడు తనపేరు భరత్ అని, తనకు మరో వ్యక్తి సహకరించాడని చెప్పాడు. పోలీసులు ఆ రెండో వ్యక్తి పేరు కూడా ఎఫ్ఐఆర్లో రాసేశారు. తీరా అరెస్టు చయడానికి ఇంటికి వెళ్తే, అతడు రెండేళ్ల పిల్లాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. పోలీసులు ఆ మాట నమ్మలేదు. ఆ కుటుంబాన్ని వేధించారు. తర్వాతి రోజు ఆ తల్లిదండ్రులు పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి, విషయం చెప్పారు. మీడియాకు విషయం తెలిసి అది కాస్తా భగ్గుమన్న తర్వాత.. అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వాళ్లు అతడి పేరును ఎఫ్ఐఆర్ నుంచి తీసేస్తామన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2 year-old  Thief  sadarpur police  burglary case  up police  

Other Articles