AP CM Naidu's net assets valued at Rs 42.4 lakh at last fiscal

Nara lokesh announces family assets

Nara Lokesh, Nara Lokesh Assets, Chandrababu Naidu, TDP, Chandrababu Naidu Assets, nara bhuvaneshwari assests, nara bramhini assests, heritage assests, heritage value, heritage profit

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu's son and TDP youth leader Nara Lokesh on Saturday announced his family assets in NTR Trust Bhavan at a press conference.

జగమెరిగిన పతుల వద్ద పైసలు నిల్.. వారి సతుల ఆదాయం పుల్

Posted: 09/26/2015 07:24 PM IST
Nara lokesh announces family assets

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబంలో అదేనండీ నారా వారి కుటుంబంలో పతులను జగమెరుగును. అయితే బయట పల్లకీల మోత అన్నట్లుగానే వాళ్లకెంత ఖ్యాతి వున్నా అది గడప వరకే పరిమితం. ఎందకంటే నారి వారి కుటుంబంలో సతులే.. పతుల కన్నా సంపన్నులు. ఈ వివరాలను సవ్యంగా చంద్రబాబు తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రకటించారు. హెరిటేజ్ ద్వారానే తమ కుటుంబానికి ఆదాయం వస్తోందని తెలిపారు. 1992లో హెరిటేజ్‌ను నెలకొల్పామని...హెరిటేజ్ ద్వారా 2073 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. ఖర్చులు పోను హెరిటేజ్ లాభాలు రూ.30 కోట్లు అని వివరించారు. హెరిటేజ్‌ సంస్థను అమ్మ, బ్రహ్మణి నడిపిస్తున్నారని చెప్పారు. పద్దతి ప్రకారమే హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నామని లోకేష్ తెలిపారు. హెరిటేజ్‌ సంస్థకు జాతీయ అవార్డులు వచ్చాయన్నారు.

కొందరు నేతలు రాజకీయాలను అవినీతిమయంగా మార్చారని మండిపడ్డారు. తమ కుటుంబంపై, తమ వ్యాపారాలపై కాంగ్రెస్ హయాంలో విచారణ కమిటీలు వేశారు...ఒక్కటి కూడా నిలవలేదని లోకేశ్ అన్నారు. గత ఐదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని...అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఆస్తులను ప్రకటిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. పాలు, కూరగాయల వ్యాపారంతోనే బతుకుతున్నామని ఆయన తెలిపారు. మూడు లక్షల మంది రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూస్‌ చానెల్‌ పెట్టాలనే ఆలోచన తమకు లేదని నారా లోకేష్‌ వెల్లడించారు.

నారావారి ఆస్తుల వివరాలు :
* చంద్రబాబు ఆస్తులు రూ. 42.40 లక్షలు
* భువనేశ్వరి ఆస్తులు రూ. 33.07 కోట్లు
* లోకేష్‌ ఆస్తులు రూ. 7.67 కోట్లు
* బ్రహ్మణి ఆస్తులు రూ. 4.77 కోట్లు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  telugdesam  andhra pradesh  assets  

Other Articles