Man invites friends and relatives for his first night

Man invites for his first night through banner

Man invites friends and relatives for his first night, through banner, Invitation for first night, first night invitation, first night invitation banner, invitation banner for first night, frustration on banners in city

A crazy man invites the public for his first night. For this, he even put on a big banner as an invitation, on which the venue and other details are there.

అంతర్జాలంలో హల్ చల్: శోభనమహోత్సవానికి ఆహ్వానం పలికిన వరుడు

Posted: 09/26/2015 06:57 PM IST
Man invites for his first night through banner

పిచ్చి పీక్ స్టేట్ కి ఎక్కిన ఓ నవ వరుడు ప్రచార వ్యామోమంతో చేశాడా..? లేక అతగాడి మిత్రులు ఆటపట్టించడానికి చేశారా..? తెలియదు కానీ ఎప్పుడో తొమ్మిది మాసాల క్రితం ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ.. ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. అదేంటి ఇప్పుడి వరకు ఆ ఫ్లెక్సీ అలానే ఎలా వుంది అంటారా..? నిజమే ఫ్లెక్సీ లేదు కానీ.. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తరువాత.. అది ఎందకనో విశేషంగా ఆకట్టుకోవడంతో ఓ స్మార్ట్ ఫోన్ దారుడు దానినిన తన సెల్ ఫోన్ లో బందించి... తాజాగా నెట్ లో అప్ లోడ్ చేశాడు. ఇంతకీ విషయానికి రండీ అంలున్నారా..? ఆ ఫ్లెక్సీలో అంత విచిత్రమేమిటీ అంటున్నారా..?

ఎవరైనా సర్వసాధరణంగా నిశ్చితార్థానికో.. లేక వివాహానికో బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. తమను ఆశీర్వదించి.. తమ బోజనతాంబులాదులు స్వీకరించి వెళ్లాల్లని వధువరులో లేక వారి తరపున వారి కుటుంబ పెద్దలో ఆహ్వానిస్తుంటారు. కానీ ఇక్కడ విభిన్నమైన కార్యక్రమానికి ఆహ్వానించాడు వరుడు. కదణరంగంలోకి అడుగుపెడుతున్న యువరాజులా ఫోజు పెట్టి.. సరిగ్గా అలాంటి ఆహార్యంతోనే స్టిల్ పెట్టి మరీ బంధుమిత్రులను ఆహ్వానించాడు. దేనికంటారా..? తన శోభనానికి. వినడానికే విచిత్రంగా వున్నా ఇది మాత్రం ముమ్మాటికీ నిజం.

రాత్రంతా జరిగే తన శోభన కార్యక్రమం అదే నండి తొలి రాత్రి వేడుకను మధుర రాత్రిగా మలిచేందుకు.. మార్చుందుకు బందుమిత్రులందరూ రావాలని ఫ్లెక్సీలు వేసి మరీ అక్కడక్కడ జనసంద్రాత అధికంగా వుంటూ పలుప్రాంతాల్లో పెట్టాడు. అవసరం వున్నా.. లేకున్నా.. తమ ఫోటో నలుగురికి కనబడాలనే పిచ్చి వున్న వాళ్లు అనేకం కాబట్టే దీనిని కూడా ఎవరు పట్టించుకోలేదు. అయితే రానురాను ఈ  ఫ్లెక్సీ ఆకట్టుకుంటుండం.. శోభనమహోత్సవ ఆహ్వానం అని వుండటంతో ఆకట్టుకుంది. దుర్భరేవులోని తమ స్వగృహమునందు రాత్రంతా జరిగే కార్యక్రమానికి అహ్వానం అలస్యంగా అందడం పక్కన బెడితే.. ఈ ఫ్లెక్సీ ఫోటో మాత్రం నెట్ లో హల్ చల్ చేస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : First night  invitation  frustration on banners  crazy guy  

Other Articles