Hardik announces 'lollipop movement' against Guj's govt's

Lollipop movement hardik patel fresh protest against gujarat govt

Hardik Patel, Patidar leader, Patidar, Patel community, hardik patel rally, hardik patel speech, lollipop movement, Gujarat, Gujarat government, Hardik Patel lollipop movement, lollipop movement in Gujarat by Hardik Patel, India news, Lollipop movement: Hardik Patel fresh protest against Gujarat govt.

Hardik Patel announced that, he would be launching a lollipop movement against Gujarat government.

ITEMVIDEOS: గుజరాత్ ప్రభుత్వ ప్యాకేజీకి వ్యతిరేకంగా లాలీపాప్ ఉద్యమం

Posted: 09/26/2015 08:02 PM IST
Lollipop movement hardik patel fresh protest against gujarat govt

గుజరాత్ ప్రభుత్వం పటేళ్ల సంక్షేమం కోసం రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీని ప్రకటించడాన్ని పటేళ్ల నేత హార్దిక్ పటేల్ తప్పుబట్టారు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తమకు ప్యాకేజీ లాలీపాప్ లాంటిదని, దానిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్యాకేజీకి వ్యతిరేకంగా లాలీపాప్ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై పటిదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్దిక్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్య ఏడ్చే పిల్లలకు లాలీపాప్ ఇచ్చినట్లుగా ఉందని...అందుకే గుజరాత్‌లో లాలీపాప్ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ప్రభుత్వ ప్యాకేజీ పటేల్ వర్గానికి లాలీపాప్ వంటిదని హార్దిక్ పటేల్ ఆరోపించారు.

 

ఆందోళనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పటేల్ వర్గీయులకు లాలీపాప్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 29 తర్వాత లాలీపాప్ ఉద్యమం చేపడతామని చెప్పారు. పటేల్ రిజర్వేషన్లపై 29న గుజరాత్ హైకోర్టులో విచారణ జరుగనుంది. అయితే కొంతమంది ఔత్యాహిక పటేల్ మద్దతుదారులు రాజ్‌కోట్‌లో ఇప్పటికే లాలీపాప్‌లు పంచుతున్నారు. పటేళ్లకు గుజరాత్ ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయడం లేదని ఆర్థికంగా వెనుకబడ్డ వర్గీయులకు ఇప్పటికే ఇస్తున్న పథకాలను ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. తమను ఓబీసీల్లో చేర్చాలంటూ ఉద్యమం చేస్తున్న పటేళ్లను శాంతింపజేసేందుకు గుజరాత్ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇచ్చింది. రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని గుజరాత్ సీఎం ఆనంది బెన్ పటేల్ స్పష్టం చేశారు. పటేళ్లు ఆందోళన విరమించాలని ఆమె కోరారు. అటు తమకు ప్యాకేజీలు అవసరం లేదని తమ ఏకైక లక్ష్యం రిజర్వేషన్లు సాధించడమే అని పటేల్ నేతలు తేల్చిచెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lollipop movement  Hardik Patel  Gujarat  

Other Articles