Delhi Hindu woman wants to join Islamic State

Hindu woman wants to join isis

ISIS, Terrorists, Muslims, HIndu, Delhi, NIA, Security, Syria, Iran, Iraq

In a shocking case of Islamic State radicalisation in India, a young Hindu woman from Delhi had planned to go Syria to support ISIS but, luckily, her father found out about her plan and sought help of the National Investigation Agency. As per a report in The Indian Express, the woman, in her mid-20s, had graduated from a premier Delhi University college and went to Australia for post-graduate studies. As per her father, a retired Army Lt Colonel, she was a changed person after her visit Down Under.

ఐఎస్ఐఎస్ లో చేరాలనుకున్న హిందు అమ్మాయి

Posted: 09/21/2015 11:27 AM IST
Hindu woman wants to join isis

ఐఎస్ఐఎస్ అంటేనే ప్రపంచానికి వణుకుపుడుతోంది. సిరియా, ఇరాన్, ఇరాక్ లోను కాకుండా అన్ని దేశాల్లో కూడా ఐఎస్ఐఎస్ జాడలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల నుండి ఐఎస్ఐఎస్ లోకి చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ముస్లిం వర్గానికి చెందిన వారు ఈ ఉగ్రవాద సంస్థలో చేరుతున్నారు. అయితే తాజాగా ఓ మహిళ కూడా ఇందులోకి చేరాలని అనుకుంది. ఆ వార్త దేశంలో సంచలనానికి తెర తీసింది. ఢిల్లీకి చెందిన ఓ మాజీ సైనికుడి కూతురు సిరియా వెళ్లి ఐఎస్ఐఎస్ లో చేరాలని అనుకుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటేే. ఆ అమ్మాయి హిందు అమ్మాయి. అవును హిందు అమ్మాయే ఐఎస్ఐఎస్ లో చేరాలనుకుంది.

Also Readఇస్లామిక్ స్టేట్ సరికోత్త ఆయుధం ‘ఎయిడ్స్ బాంబ్’

ఢిల్లీకి చెందిన ఓ మాజీ కల్నల్ కూతురు స్థానికంగా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తర్వాత పోస్ట గ్రాడ్యుయేషన్ కోసమని... ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయిే కొద్ది కాలంగా తన కూతురు ప్రవర్తన మీద అనుమానం వచ్చిన తండ్రి ఆమె కంప్యూటర్ ను చూశారు. తన కూతురు ఐఎస్ఐఎస్ సంస్థలో చేరాలని అనుకుంటోందని.. అందుకు చర్చలు కూడా జరిపిందని.. సిరియా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుందని తెలిసింది. వెంటనే నేషనల్ సెక్యురిటి ఏజెన్సీ వారికి సమాచారం అందించాడు. వాళ్లు ఆమె దగ్గరి నుండి మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. మొత్తంగా ఓ హిందు మహిళ ఇలా ముస్లిం సంస్థలో చేరాలనుకోవడం కాస్త కలకలం రేపుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Terrorists  Muslims  HIndu  Delhi  NIA  Security  Syria  Iran  Iraq  

Other Articles