black flags during Modi visit to US

Modi to face protests

Modi, Narendra Modi, US, Protest, America, Modi Tour, Indian PM

Several anti-Modi groups in the US will hold a series of protest rallies against Prime Minister Narendra Modi when he travels to New York and Washington this month, reports PTI.

వాళ్ల వల్ల మోదీకి అమెరికాలో కష్టాలు

Posted: 09/21/2015 11:26 AM IST
Modi to face protests

మోదీ.. నమో.. ఏడాది క్రితం నుండి బాగా వినిపిస్తున్న నినాదం. కానీ గత కొంత కాలంగా మోదీ ప్రభ కాస్త తగ్గింది. నరేంద్రమోదీ అఖండ విజయానికి మొన్నటి దాకా వీసా ఇవ్వని అమెరికా సాదరంగా స్వాగతం పలికింది. అమెరికా రావాలని అక్కడి ఒబామా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడం.. వెంటనే మోదీ వెళ్లడం జరిగిపోయాయి. అమెరికాలో మోదీ ప్రభ వెలిగిపోయింది. అయితే తాజాగా మరోసారి అమెరికా బయలుదేరిన మోదీకి కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. నిన్నటి దాకా మోదీ.. జిందాబాద్ అని మాత్రమే వినిపించిన నినాదాల్లో కొత్తగా... మోదీ ముర్దాబాద్ అని కూడా వినిపించనున్నాయి. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు తమ నిరసనను అమెరికాలో మోదీ మీద చూపించనున్నారు. నిన్నటి దాకా మోదీని మోసిన వారే... కొత్త కష్టాలకు కారకులయ్యారు. దాంతో మోదీ అమెరికా పర్యటన మీద ఆసక్తి పెరిగింది.

Also Read : మోదీ Vs హార్దిక్ పాటిల్ కాదు.. పటేల్ Vs రిజర్వేషన్లు

ఇంతకీ అమెరికాలో మన మోదీకి వ్యతిరేకంగా ఎవరు నిరసన తెలుపుతురన్నారో తెలుసా..? గుజారత్ లోనే కాకుండా మిగిలిన రాష్ట్రాలకు కూడా పాకుతున్న పటేల్ రిజర్వేషన్ గొడవే అమెరికాలో కూడా మోదీ సభలో గొడవకు దారి తీసింది. అదేంటి అనుకుంటున్నారా..? గుజరాత్ పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు. హార్దిక్ పాటిల్ నాయకత్వంలో పటేల్ పోరాట్ మరింత ఉద్రృతమవుతోంది. అయితే హార్దిక్ పిలుపు మేరకు అమెరికాలోని పాటేళ్లు కూడా మోదీకి తమ నిరసనను తెలుపనున్నారు. మోదీ పాల్గొంటున్న సభలో తమ నిరసన గళాన్ని విప్పాలని పటేల్ వర్గానికి చెందిన వారు నిర్ణయించారట. మొత్తానికి ఎప్పుడూ మోదీ భజనే కాదు కాస్త డిఫరెంట్ గా ఏదో జరగబోతోందని అందరూ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Narendra Modi  US  Protest  America  Modi Tour  Indian PM  

Other Articles