pawan kalyan suggest ministers not to call farmers land afterall

Pawan kalyan questions tdp government on murali mohan approching court

pawan kalyan, Janasena, land aquisition issue, unidentified man thrown stone at pawan kalyan, land pooling, AP capital, amaravathi region, twitter, Ramjethmalani, speculations, Pawan land acquisition, Pawan land pooling, pawan ram jetmalani, pawan ap land pooling, I am not a slave to any party, pawan people side, pawan development obstructive person, Pawan Kalyan

Pawan Kalyan, questions TDP Government, on murali mohan approching court for his haif acre land which acquired by congress government

టీడీపీ ఎంపీ కోర్టుకెందుకెళ్లారు..? ఆఫ్ట్రాల్ అనకండీ.. ప్రభుత్వానికి పవన్ సూచన

Posted: 08/23/2015 05:48 PM IST
Pawan kalyan questions tdp government on murali mohan approching court

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి ఒక సినీ నటుడుగా, రాజకీయ వేత్తగా రాలేదని, తోటి రైతుగా వచ్చానని, మీకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసిన గ్రామాల్లో పర్యటన నిమిత్తం ఆదివారం పెనుమాక వచ్చిన ఆయన అక్కడ రైతులతో ముఖాముఖి చర్చలు జరిపిన అనంతరం మాట్లాడుతూ...రాజధాని కోసం భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను ఉద్దేశించి ప్రభుత్వానికి పలు కీలక ప్రశ్నలు సంధించారు. ముఫై వేల ఏకరాలను సేకరించాం.. ఆఫ్ట్రాల్.. మూడు వేల ఎకరాల కోసం ఎందుకింత రాద్ధాంతం? అని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనను ప్రశ్నించిన విషయాన్ని పవన్ గుర్తు చేస్తూ... ఆయన ఘాటు సమాధానాలు ఇచ్చారు.

ఒక ఎకరంలో పది కుటుంబాలను పంచుకుని జీవినాన్ని సాగిస్తున్నాయని.. అంటే మూడు వేలక ఎకరాల్లో ఎన్ని కుటుంబాలు జీవనానని సాఘిస్తున్నాయయో మీకు తెలుసా..? అని ప్రశ్నించారు. భూములను నమ్మకుని తమ మానా తాము జీవినాన్ని సాగిస్తున్న సన్నకారు, చిన్నకారు రైతుల నుంచి సెంటు మొదలుకుని ఏకరాల వరకు భూమిని లాక్కంటున్నారని ఇది మీకు సమంజసమా అని ప్రశ్నించారు. మీకు వేల ఎకరాలు అఫ్ట్రాల్ కావచ్చు.. కానీ అవే వేల కుటుంబాలకు జీవనోపాధని మరవడం సమంచికాదని తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా సినీనటుడు, ఎంపీ మురళీమోహన్ అంశాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో తన భూమి పోతోందంటూ ఎంపీ మురళీ మోహన్ రాష్ట్రస్థాయి కోర్టులు మొదలుకుని సుప్రీకోర్టు వరకెళ్ళిన సంగతిని పవన్ గుర్తు చేశారు. ఆయనకు కూడా చాలా ఆస్తులున్నాయని పేర్కొంటూ, కొద్దిపాటి భూమి కోసం మురళీ మోహన్ కోర్టుకెక్కినప్పుడు, భూమిపై ఆధారపడి జీవితాన్ని గడుపుతున్న రైతులు దాని కోసం పోరాడటంలో తప్పేముందని అడిగారు. అస్తులున్న మురళీమోహన్ అర ఎకరం పోతున్నప్పుడు అంత బాధ వుంటే.. సెంటు భూమి తప్ప ఏమీ లేని రైతుకు తన భూమి పోతుంటే భాధ వుండదా..? అన్ని ఆయన ప్రశ్నించారు. రైతుకు అన్నం పెడుతున్న భూమి విషయంలో మంత్రి కిషోర్ బాబు ఆఫ్ట్రాల్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని పవన్ తప్పుబట్టారు.

భూ సేకరణ, ల్యాండ్ పుల్లింగ్ అన్న విధానాలను పక్కబెడితే.. ేడాదికి మూడు నాలుగు పంటలు పండించే భూములలో రాజధాని నిర్మాణం ద్వారా మరో సమస్య కూడా తెరపైకి వస్తుందని అన్నారు. ఆ సమస్య ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఉదయిస్తుందన్నారు. ప్రపంచ బ్యాంకు తీవ్ర అందోళన వ్యక్తం చేసింది కూడా ఈ సమస్యపైనేనన్నారు. అదే ఆహార భద్రత అని పవన్ గుర్తు చేశారు. బహుళ పంటలను పండించే భూముల్లో కట్టడ్డాలు వస్తే.. ప్రపంచ జనాభాకు కావాల్సిన అహారం ఎక్కడ తయారవుతుందని పవన్ ప్రశ్నించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  land aquisition issue  AP capital  farmers  TDP  

Other Articles