i am not obstructing development: pawan

I am not a slave to any party i am on people side pawan

pawan kalyan, Janasena, land aquisition issue, unidentified man thrown stone at pawan kalyan, land pooling, AP capital, amaravathi region, twitter, Ramjethmalani, speculations, Pawan land acquisition, Pawan land pooling, pawan ram jetmalani, pawan ap land pooling, I am not a slave to any party, pawan people side, pawan development obstructive person, Pawan Kalyan

I am not a slave to any party, I am on people side: and not a person who obstruct development says pawan kayan

నేను మిత్రపక్షాన్నే కానీ బానిసను కాదు.. నాది ప్రజాపక్షం: పవన్

Posted: 08/23/2015 05:30 PM IST
I am not a slave to any party i am on people side pawan

తెలుగు దేశం పార్టీకి చెందిన మంత్రులు, పార్టీ శ్రేణులకు తాను రాజధాని ప్రాంత రైతులు భూ సమీకరణ విషయమై స్పందిస్తున్న క్రమంలో వారు అనేక విమర్శలు చేశారని జనసేన అధినేన పవన్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. టీడీపీతో తెగదెంపులు చేసుకునేందుకు తనకు ఎంత సేపు పడుతుందని ఆయన ప్రశ్నించారు. వీధి పోరాటాలు చేయడానికి మనం పార్టీలు పెట్టుకోనవసరం లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలు అవసరం లేదని... కానీ మాటలు ద్వారా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని, ఆ ఉద్దేశంతోనే వచ్చానని, టీడీపీతోగానీ, సీఎం చంద్రబాబు నాయుడుతో గొడవ పెట్టుకోడానికి రాలేదని పవన్‌ అన్నారు. గొడవలు పెట్టుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయంటే నేను దానికి కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

నవ్యాంధ్రగా ఏర్పడిన రాష్ట్రానికి అనుభవం వున్న నాయకులు కావాలని, తొమ్మిదేళ్ల పాలనానుభం వున్నచంద్రబాబు నాయుడుకు తాను మద్దతిచ్చినట్లు పవన్ చెప్పారు. అయితే తనకు వ్యక్తిగతంగా ఎవరూ శత్రువులు లేరని వైసీపీని ఉద్దేశించి పవన్‌ వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ పార్టీ ఎక్కువ, తక్కువకాదని అన్నారు. తాను అభివృద్ధికి ఆటంకం కలిగించేవాడనని టీడీపీలో కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు తనకు కోపాన్ని తెప్పించాయన్నారు. తాను ఎవరి పక్షానో మాట్లాడుతున్నానని విమర్శలు తగవన్నారు. తనది ప్రజల పక్షమని చెప్పుకోచ్చారు. అలా అనుకుంటే తాను టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తానని పవన్‌ ప్రశ్నించారు

నవ్యాంధ్రలో అధికారంలో వున్న తెలుగుదేశం ప్రభుత్వానికి తాను మిత్రపక్షవాదినని చెప్పుకోచ్చిన పవన్.. అంతమాత్రాన ప్రభుత్వం చేసే ప్రతీ కార్యక్రమాన్ని వెనుకేసుకురాలేమని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు అన్ని మంచిగా వుంటాయని చెప్పలేమని, కొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించవచ్చని.. అలాంటిదే రాజధాని భూసేకరణ కార్యక్రమం అన్నారు. దీనిని తాను తన పార్టీ పరంగా ఖండిస్తున్నానని, రైతుల భూములను బలవంతంగా లాక్కోవద్దని తాను అనేక పర్యాయాలు సూచించానని చెప్పుకోచ్చారు. మిత్రపక్షం అయినంత మాత్రాన అధికారపక్షానికి తాను బానిసను కాదని తేల్చిచెప్పారు. ప్రజల నుంచి సేకరించకుండానే గొప్ప రాజధాని కట్టుకునేంత భూమి రాష్ట్రంలో అందులోనూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే వుందని పవన కల్యాన్ అన్నారు

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  land aquisition issue  AP capital  farmers  TDP  

Other Articles