pawan kalyan suggest ap government, not to acquit farmers land

Pawan kalyan warns of stir against land acquisition for andhra pradesh capital

pawan kalyan, Janasena, land aquisition issue, unidentified man thrown stone at pawan kalyan, land pooling, AP capital, amaravathi region, twitter, Ramjethmalani, speculations, Pawan land acquisition, Pawan land pooling, pawan ram jetmalani, pawan ap land pooling, I am not a slave to any party, pawan people side, pawan development obstructive person, Pawan Kalyan

Jana Sena president Pawan Kalyanthreatened to stage a dharna if the TDP-led AP government decides to go ahead with "forcible" land acquisition for construction of the state's capital.

రైతుల కన్నీళ్లతో రాజధాని వద్దు.. బలవంత భూసేకరణ చేస్తే.. ధర్నాకు సిద్దం : పవన్ కల్యాణ్

Posted: 08/23/2015 06:09 PM IST
Pawan kalyan warns of stir against land acquisition for andhra pradesh capital

సమైక్య రాష్ట్రంలో హైటెక్ సిటీ కట్టి, అభివృద్ది చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పేదల భూములను బలవంతంగా తీసుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం పెద్ద సమస్య కాదని జనసేన అధినేత, ప్రముఖ నటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడిని రాష్ట్రానికి రప్పించిన చంద్రబాబుకు ఇది పెద్ద సమస్య కాదని అయన చెప్పుకోచ్చారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములు ఇవ్వని రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవొద్దని ఆయన స్పష్టం చేశారు. ఆనందంతో కట్టే రాజధాని కావాలి గానీ రైతులు కన్నీళ్లతో కట్టే క్యాపిటల్ సిటీ వద్దన్నారు. గుంటూరు జిల్లా పెనుమాకలో రాజధాని ప్రాంత రైతులతో ఆదివారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు.

ఒక వేళ వచ్చే ఎన్నికలలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రాకపోతే.. రైతులు తమకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎవరిని అడగాలని ఆయన ప్రశ్నించారు. ఏ నారాయణ, ఏ పత్తిపాటి పుల్లారావును అప్పడు ఎన్నికలలో గెలవకపోతే.. రైతులు ఎవరిని నమ్మి భూములను ఇవ్వాలని పవన్ ప్రశ్నించారు. రైతులు సంతోషంగా భూములు ఇస్తే తీసుకోవాలని.. అందుకు తాను అభ్యంతరం చెప్పనని, అయితే బలవంతంగా భూములను మాత్రం లాక్కోవద్దని చెప్పారు. తన సూచనలు ప్రభుత్వం పరిశీలిస్తే.. సరేనని అలాకాక.. మొండిగా భూసేకరణ చట్టం ద్వారా ముందుకెళ్తే.. తాను ధర్నా చేసేందుకు కూడా సిద్దమని పవన్ హెచ్చరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  land aquisition issue  AP capital  farmers  TDP  

Other Articles