If you don't marry me i will kill u threatens tirupur women si

Case registered against woman si

Tirupur South police, case against Sub-Inspector, SI Uma Maheswari, studio owner Bharathi Vasan, assaulting at Collectorate, Sections 323, 324 Indian Penal Code, 506 (ii) (criminal intimidation), Social Justice and Human Rights wing, tirupur District Headquarters hospital, women si, photographer, tirupur, assult case

The Tirupur South police registered a case against Sub-Inspector Uma Maheswari and Bharathi Vasan, a photographer, on the charges of assaulting each other near Collectorate.

ఏరా.. నన్ను పెళ్లిచేసుకోవా..? చంపేస్తాను జాగ్రత్తా..! మహిళా ఎస్ ఐ దౌర్జన్యం

Posted: 08/21/2015 07:28 PM IST
Case registered against woman si

తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపుతానని మహిళా ఎస్‌ఐ బెదిరిస్తోందంటూ ఓ స్టూడియో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తమ గూటికి చెందిన పక్షిని రక్షించడంతో దూకుడును ప్రదర్శించిన పోలీసులు ఇద్దరిపై కేసు పెట్టారు. మహిళా ఎస్ ఐపై నామమాత్రంగా కేసులు పెట్టిన పోలీసులు. పిర్యాదుదారుపై మాత్రం కాస్తా కఠినతరమైన సెక్షన్లను నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుప్పూర్‌ సామాజిక న్యాయం, మానవ హక్కుల విభాగంలో సబ్‌ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరికి, తమ కార్యాలయం సమీపంలో ఫోటో స్టూడియోను నడుపుతున్న భారతీ వాసన్ తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మరింది. దీంతో పెళ్లి చేసుకోవాలని ఇరువురు భావించారు.

కానీ, కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఉమామహేశ్వరి స్టూడియోకి వెళ్లి వాసన్ తో ఘర్షణ పడింది. ఈ ఘర్షణలో ఆగ్రహం చెందిన మహేశ్వరి స్టూడియోలోని వస్తువులను ధ్వంసం చేసి, తనను పెళ్లి చేసుకోకపోతే చంపుతానని వాసన్ ను బెదిరించి స్టేషన్‌కు వచ్చేసింది. వాసు తనకు డబ్బులు ఇవ్వాలని, అది అడిగేందుకు స్టూడియోకు వెళితే తెల్లకాగితంపై సంతకం తీసుకొని తనను బెదిరిస్తున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. పోలీసులు వాసును స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా ఉమామహేశ్వరిని తాను పెళ్లిచేసుకోకుంటే చంపుతామని బెదిరించిందని తెలిపాడు.

తన స్టూడియోను కూడా ధ్వంసం చేసిందని ఫిర్యాదు చేశాడు. ఇరువురి వాదన, ప్రవర్తన విచిత్రంగా ఉండడంతో సైక్రియాటిస్టులచే పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఉమామహేశ్వరి కేసుపై తిరుచ్చి సహాయ పోలీస్‌ కమీషనర్‌కు ఉన్నతాధికారులు నివేదిక పంపారు. ఉమామహేశ్వరి గతంలో పల్లడంలో పనిచేసినప్పుడు కూడా కలకలం రేపింది. కున్నూర్‌ మేజిస్ట్రేట్ తంగరాజ్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడున్నాడంటూ అప్పట్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. మరి ఈ కేసు ఎక్కడికి దారితీస్తుందో వేచి చేడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women si  photographer  tirupur  assult case  

Other Articles