Spelling mistakes, Smriti Irani, letterhead, Inquiry ordered, teacher, highlighted

Spelling mistakes spotted in smriti irani s letter inquiry ordered

Spelling mistakes in smriti irani letter, Smriti Irani, letterhead, Inquiry ordered, teacher, highlighted, Union Education Minister smriti irani, social media platforms on smriti irani, butt of jokes on smiti irani

After a teacher highlighted the spelling mistakes in the Education Minister's letter, Smriti Irani has become a butt of jokes on social media platforms.

స్మృతి ఇరాని లెటర్ హెడ్ లో అక్షర దోషాలు.. నెట్ జనుల జోకులు..

Posted: 08/21/2015 04:42 PM IST
Spelling mistakes spotted in smriti irani s letter inquiry ordered

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరాని దేశవ్యాప్తంగా నెట్ జనులు నుంచి అబాసుపాలయ్యారు. విపక్షాల విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడంలో ముందున్న స్మృతి ఇరాని.. ఇప్పటికే తన విద్యార్హతల విషయమై కోర్టులో కేసు విచారణను ఎదుర్కోంటున్నారు. అయితే ఇదే సందర్భంలో తన లెటర్ హెడ్ లో తప్పులు దొర్లాయి. ఆ తప్పులు అమె లేఖ సారంశంలో కాకుండా.. ఏకంగా లెటర్ హెడ్ లో నీలి రంగులో ప్రింట్ చేయబడిన అక్షరాల్లోనే వున్నాయి. అంటే సుమారుగా 15 మాసాలుగా అదే లెటర్ హెడ్ ను వినియోగిస్తున్నా.. కేంద్ర మంత్రివర్యులు.. దానిని సరిచూసుకోకపోవడం.. సవరించేందుకు అదేశాలు ఇవ్వకపోవడంపై నెట్ జనులు తలోమాటా అనేస్తున్నారు. అసలా లెటర్ హెడ్ లో తప్పులు ఎలా బయటపడ్డాయి..? అంటే..

సిబిఎస్ఈ సెకండరీ, సీనిరయర్ సెకండరీ విద్యార్థుల ఫలితాలు వెలువడిన తరువాత.. ఉత్తమ ఫలితాలను సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులకు.. వారి సేవలను శ్లాఘిస్తూ.. జూలై 11న ఉత్తరాలను పంపింది. ఈ క్రమంలో ఢిల్లీలోని రిచ్చాకుమార్ అనే ఉపాధ్యాయుడు.. తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా..  స్మృతి ఇరానీ ఫేస్ బుక్ అకౌంట్ లోకి వెళ్లి, తన అభిప్రాయాలను వెలిబుచ్చాడు. మంత్రివర్యా.. మీ లేఖ మాకు అందింది. మమల్ని మా, ప్రతిభను, శ్రమను, గుర్తించి మీరు పంపిన అభినందనలకు ధన్యులమని పేర్కోన్నాడు.

అయితే తాను గత 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో వున్నందున్న, అందులోనూ బాషా పండితుడను అయినందున.. ఉండబట్టలేక ఈ విషయాన్ని మీ దృష్టికీ తీసుకువస్తున్నాను. మీ లెటర్ హెచ్ లో సన్ సధన్, మినిస్టర్ అనే రెండు పదాలు తప్పుగా అచ్చు అయ్యాయి. వాటిని వెంటనే సవరించుకోండి. దీనిపై మీరు వ్యక్తిగతంగా సమాధానమివ్వాల్సన అవసరం ఏర్పడుతుందని పేర్కోన్నాడు. కనీసం మీ మంత్రిత్వ శాఖలో, మీ కోసం పనిచేసేవారినైనా ఉన్నత విద్యలను అభ్యసించిన వారిని ఏర్పటు చేసుకోవాలని కోరాడు. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ కావడంతో కొందరు మంత్రి దృష్టికి తీసుకెళ్ళగా.. అమె దీనిపై స్పందించారు. తన పేరును కూడా తాను హిందీలో తప్పుగా రాయనని సమాధానమిచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Spelling mistakes  Smriti Irani  letterhead  Inquiry ordered  social media platforms  jokes  

Other Articles