dwarf couple bonded together with marriage by google

Google performs dwarf marriage in tamilnadu

google dwarf marriage, google performs dwarf marriage, dwarf marriage in Tamilnadu, tamilnadu dwarf marriage, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, national news, telugu news,

A dwarf couple got married in a village in Tamilnadu, after they fell in love with each other, chatting regularly in social networking sites.

నువ్వా ధరిణి.. నేనీ ధరణి.. గూగుల్ కలిపింది ఇద్దరినీ...

Posted: 08/21/2015 01:46 PM IST
Google performs dwarf marriage in tamilnadu

ఔను..! వాళిద్దరూ ఇష్టపడ్డారు.. ఒక్కటయ్యారు.. అందుకు కారణం మాత్రం గూగుల్ తల్లే. పెళ్లీడు వచ్చినా.. తమకు సరిజోడు దోరకక.. మనోవేధన పడిన వారిద్దరిని.. ప్రముఖ సర్చ్ ఇంజన్ గూగుల్ కలిపింది. నేనీ దరిణి, నువ్వా ధరిని గూగుల్ కలపింది ఇద్దరినీ అంటూ ఇద్దరూ ఎంచక్కా చట్టపట్టాలేసుకుని యువళగీతం పాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు.. ఏమా కథ.? అంటున్నారా..? తమిళనాడుకు చెందిన రెండున్నర అడుగుల అబ్బాయి.. మహారాష్ట్రకు చెందిన మూడడుగుల అమ్మాయి.. తమకు జీవిత భాగస్వామి కోసం వెతకని చోటు లేదు.

ఇక జీవితం అంతే అనుకుంటున్న సమయంలో ‘గూగుల్‌’ తల్లి ఇద్దరినీ కలిపింది. తమిళనాడులో నిన్ననే ఒక్కటైన ఈ మరుగుజ్జు జంట వివరాల్లోకి వెళితే.. మదురై జిల్లా పుదూరుమన్‌ మలైమేడుకు చెందిన మరుదు మురుగన్‌, జానకి దంపతులకు ముగ్గురు కుమారులు. మూడో కుమారుడు రామ్‌జీ (27) మరుగుజ్జు. బీబీఏ పట్టభద్రుడైన రామ్‌జీ.. మదురైలోని ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నాడు. పెళ్లీడు వచ్చినా.. రామ్‌ జీ తన ఎత్తుకు సరిపడా వధువు కోసం తీవ్రంగా ప్రయత్నింది.. చివరకు గూగుల్‌ను ఆశ్రయించాడు.

ఇందులో.. మహారాష్ట్ర థానే జిల్లా అంబర్‌నాథ్‌లోని తులసిదాస్‌, శశికళ దంపతులు కుమార్తె యోగిత మూడగుల ఎత్తున్నట్లు తెలిసింది. ఫేస్‌బుక్‌లో మాటామాటా కలిసింది. ఇద్దరూ పెళ్ళిచేసుకోవాలని తీర్మానించుకున్నారు. ఇందుకు ఇరు కుటుంబాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. మదురై మీనాక్షి ఆలయంలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం వైభంగా జరిగింది. రామ్‌జీ తండ్రి మరుదు మురుగేశన్‌ మాట్లాడుతూ... ఇంటర్నెట్‌ పుణ్యమా అని తన కుమారుడికి తగ్గ జోడీ లభించిందని, దీంతో తమ కుమారుడి వివాహాన్ని వైభవంగా జరిపించామని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dwarf marriage  tamilnadu  viral news  

Other Articles