SpiceJet offering tickets for as low as Rs 799 in 3-day sale

Spicejet offers discounted fares jet announces flash sale

SpiceJet,Freedom to fly,spicejet fares,SpiceJet Discount Offers,SpiceJet mobile app,crude oil prices,GoAir discount,Jet Airways discounts,Air Costa discount offer,aviation turbine fuel price (ATF)

SpiceJet announced a discount sale 'Freedom to Fly', under which the company is offering 1 lakh tickets for one-way travel, with fares starting as low as Rs 799 (excluding taxes).

మరోమారు స్పైస్‌జెట్‌ బంపర్ ఆఫర్.. రూ. 799కే టిక్కెట్

Posted: 08/21/2015 01:48 PM IST
Spicejet offers discounted fares jet announces flash sale

చవక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ మరోమారు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ‘ఫ్రీడమ్‌ టు ఫ్లై’ పేరుతో తెచ్చిన ఆఫర్‌ కింద అత్యంత తక్కువ ధరలకు విమానయానం చేసేందుకు అవకాశాన్ని కల్పించింది. సామాన్యులకు విమానయానం చేయాలన్న స్వప్నాన్ని సాకారం చేస్తూ ఈ ఆపర్ ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కింద కేవలం లక్ష టిక్కెట్లను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నట్లు విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే వన్ వే కు మాత్రమే ఈ ఆపర్ వర్తిస్తుందని సంస్థ వర్గాలు ప్రకటించాయి.

వన్‌ వే టికెట్‌ ప్రారంభ ధర 799 రూపాయల (పన్నులు కాకుండా) నుంచి 2,699 రూపాయల వరకు ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ ఆపర్ కింద టిక్కెట్లను బుక్‌ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తుంది స్పైస్ జెట్ సంస్థ. ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకునే వారు ఈ నెల ఈ ఆగస్టు 25వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 26వ తేదీ వరకు ప్రయాణించవచ్చు. స్పైస్‌జెట్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకుంటే 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను కూడా ఇస్తున్నట్టు కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శిల్ప భాటియా తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : SpiceJet  Freedom to fly  SpiceJet Discount Offers  

Other Articles