Vasundhara Raje | Rajasthan | Elections | BJP | Congress

Why bjps sweep in rajasthan civic polls should worry vasundhara raje

Vasundhara Raje, Rajasthan, Elections, BJP, Congress, Muncipal elections

Why BJPs sweep in Rajasthan civic polls should worry Vasundhara Raje The results of Rajasthan municipal elections have been declared and it has a mixed message for all key players - BJP, Congress and chief minister Vasundhara Raje. According to reports, of the 129 civic bodies, the ruling party won 67, main opposition Congress got 33, others bagged 18 while there was tie between BJP and Congress on 11 bodies. Going by seats, of the total 3351, BJP bagged 1442, Congress 1164 and others 745.

పాపం.. ఆ ముఖ్యమంత్రి గాలి తీసేశారు

Posted: 08/21/2015 12:35 PM IST
Why bjps sweep in rajasthan civic polls should worry vasundhara raje

బాగా ఫేమ్ ఉన్న పొలిటికల్ నేత ఎవరైనా ఉంటే అతని ఇలాకాలో జరిగే ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మంగా జరుగుతాయి. పరువు కోసం పాపం వాళ్లు పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక పొలిటికల్ పార్టీల లీడర్లు అయితే మరీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అయితే రాజస్థాన్ లో పాపం ముఖ్యమంత్రిగారి గాలి తీసేశారు స్థానికులు. ఎన్నికల్లో గెలవకపోతే ప్రతిపక్షాలకు దొరికిందే అదును.. అధికార పక్షం మీద ఆ నేతల మీద తిట్ల దండకం మొదలుపెడతారు. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పరిస్థితిత అచ్చం ఇలానే ఉంది. అమ్మగారి హవానో.. లేదంటే ప్రధాని మోదీ హవానో గానీ సార్వత్రిక ఎన్నికల్లో అంతులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ చర్మిషా ఎన్కని రోజులు పని చేస్తుంది చెప్పండి అందుకే పాపం అమ్మగారి పని అయిపోయింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే గాలి తీసేశారు.

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన బిజెపి అభ్యర్థులను గెలిపించుకోవడంలో వసుంధర రాజే, పార్టీ నాయకత్వం విపలమైంది. పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కన్ను లొట్ట పడ్డచందంగా తయారైంది. పేరుకేమో అధికారంలో ఉన్నా కానీ కనీసం విలువ కాపాడుకేనేలా కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టడంలో వసుంధర రాజే విఫలమయ్యారు. మొత్తం 129 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 60 చోట్ల తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా, ప్రతిపక్ష పార్టీలు 69 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో అసాధారణస్థాయిలో పుంజుకుంది. 40 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన ఆ పార్టీ, మరో 17 చోట్ల బీజేపీతో దాదాపు సరిసమానంగా సీట్లు సాధించింది. 129 మున్సిపాలిటీల్లో మొత్తం 3,351 వార్డులకు ఈ నెల 17న జరిగిన ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఇందులో ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్రులు కలిసి 1908 వార్డులు కైవసం చేసుకోగా, బీజేపీ 1443 వార్డులతో సరిపెట్టుకుంది. చావు తప్పి కన్నులొట్టపోవడం అంటే ఇదే మరి. వసుంధర రాజే మరి ఇక ముందు ఇలాంటి ఫలితాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vasundhara Raje  Rajasthan  Elections  BJP  Congress  Muncipal elections  

Other Articles