karnataka robbers gang fired at police near jubliee hills

Telangana firing in hyderabad jubliee hills

Hyderabad Jubilee Hills,Hyderabad Jubilee Hills firing, neerus shopping mall, Firing, jubilee hills, Hyderabad, Karnataka,Karnataka gang, firing at neeru shoping mall

A gang of three unidentified men opened fire near Neeru's showroom in Jubilee Hills, a posh suburban neighbourhood in Hyderabad on Thursday afternoon

జూబ్లీహిల్స్ లో కాల్పుల కలకలం.. పోలీసులపై కర్నాటక దోంగల కాల్పులు

Posted: 08/20/2015 05:26 PM IST
Telangana firing in hyderabad jubliee hills

నగరంలో పట్టపగలు కాల్పుల కలకలం రేగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని నీరూస్ వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎల్ అండ్ టీ వర్కర్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, స్థానికుల సాయంతో ఓ వ్యక్తిని పట్టుకున్నారు. మరోవ్యక్తి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులకు చిక్కిన వ్యక్తిని కర్నాటకకు చెందిన అబ్దుల్లాగా గుర్తించారు. కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ముగ్గురు వ్యక్తుల గురించి సమాచారం రావడంతో.. జూబ్లీహిల్స్కు చెందిన టాస్క్ఫోర్స్ సిబ్బంది వాళ్లను వెంబడిస్తుండగా.. బైకు మీద ఉన్న ఇద్దరిలో ఫహీమ్ అనే వ్యక్తి నీరూస్ షోరూం సమీపంలోకి వచ్చేసరికి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకుని, మాస్కులు ధరించి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వాళ్లలో ఫహీమ్ను టాస్క్ఫోర్స్ సిబ్బంది, మరికొందరు స్థానికులు కలిసి పట్టుకున్నారు. అయితే కాల్పుల నేపథ్యంలో అక్కడి నుంచి తప్పించుకున్న ఇద్దరు దుండగులలో మరోకరనిని గంట వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. అతనిని సత్తార్ గా గుర్తించారు. ముగ్గురిలో పరారైన మరో వ్యక్తి ఆచూకీ కోసం జంట కమిషనరేట్లకు చెందిన సిబ్బంది నగరం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. నగరం మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు టెర్రరిస్టు కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్‌లో కాల్పులు జరగడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

కర్ణాటకకు చెందిన దొంగల ముఠాగా వారిని అనుమానిస్తున్న పోలీసులు ఇన్నాళ్లుగా వాళ్లు ఎక్కడ ఉన్నారు, ఎవరి దగ్గర ఆశ్రయం తీసుకున్నారనే విషయాలపై దృష్టి సారించారు. నగరంలో వాళ్ల టార్గెట్ ఏంటి.. కేవలం దోపిడీయేనా, మరేదైనా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు వచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్న ఫహీమ్ నుంచి ఓ తుపాకీతో పాటు 20 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు దోపిడీలు చేయడమే ఈ గ్యాంగు లక్ష్యమని తెలుసుకున్న పోలీసులు నీరూస్ షోరూం, బిగ్ సి లను ఎందుకు టార్గెట్ చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరో పక్క వీరికి ఏదైనా ఉగ్రవాద సంస్థకు చెందిన వాడా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Jubilee Hills  firing  neerus shopping mall  Police  

Other Articles