Google | Search Engine | Anmol Tukrel

Anmol tukrel the 10th grader who claims high school project is 47 precent more accurate than google

Google, Search Engine, Anmol Tukrel, Google search engine, anmol, tech news

Anmol Tukrel the 10th grader who claims high school project is 47 precent more accurate than Google Watch out Sundar Pichai. There's a high school project that tops Google's main cash cow, the search engine. Sixteen-year-old Anmol Tukrel, an Indian-origin Canadian citizen has designed a personalised search engine that claims to be as high as 47% more accurate than Google, and about 21% more accurate on an average.

మనోడి సెర్చింజన్ గోటికి గూగుల్ సరిపోదు తెలుసా..!

Posted: 08/20/2015 04:42 PM IST
Anmol tukrel the 10th grader who claims high school project is 47 precent more accurate than google

ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్న, నెంబర్ వన్ సెర్చింజన్ గూగుల్. ప్రపంచంలో అతి వేగంగా, అన్ని అంశాలను సెర్చ్ చెయ్యగల సెర్చింజన్ గూగుల్. ప్రపంచ టెక్ భవితవ్యాన్ని మార్చిన గూగుల్ కు ఎంతో కాలంగా పోటీ లేకుండా పోయింది. ఆ మధ్య చాలా సెర్చింజన్ లు వచ్చినా కానీ గూగుల్ ను ఢీ కొట్టలేక డీలాపడిపోయాయి. అయితే ఎప్పుడూ వానాకాలం ఉండదు.. ఎప్పుడూ వర్షా కాలం ఉండదు అలాగే ఎప్పుడూ గూగుల్ టైం నడుస్తుంది అనుకుంటే అది ఎన్నటికీ చెల్లదు. గూగుల్ ను తలదన్నే విధంగా ఓ సెర్చింజన్ ను తయారు చేస్తే అది కూడా మన వాడే తయారు చేప్తే ఎలా ఉంటుంది గ్రేట్ కదా.. భారతీయులు అన్ని రంగాల్లో దూసుకెళితుంటే తాజాగా గూగుల్ కు కూడా పోటీ ఇవ్వనున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి ఏంటా మ్యాటర్ అనుకుంటున్నారా..? అయితే స్టోరీ చదవండి.

గూగుల్.. ప్రపంచ రనెంబర్ వన్ సెర్చింజన్ కు పోటీగా మన వాడు ఓ పర్సనల్ సెర్చింజన్ ను తయారుచేసే క్రమంలో ఉన్నారు. కెనడాలో సెటిలైన భారతీయ సంతతి కుర్రాడు అన్మోల్ టుక్రెల్ అనే వ్యక్తి.. గూగుల్ కు పోటీగా గూగుల్ కన్నా 47 శాతం స్పీడ్ గా పని చేసే పర్సనల్ సెర్చింజన్ ను దాదాపుగా తయారు చేశారు. మన వాడు తయారు చేశాడు అనగానే బాగా పరిశోధనలు చేసిన తలపండిన మేధావి అనుకుంటున్నారేమో కానీ అస్సలు కాదు పదో తరగతి పాస్ అయిన ఓ పదహారేళ్ల కుర్రాడు. అవును మీరు చదువుతున్నది నిజమే... పదహారేళ్ల కుర్రాడు గూగుల్ కు పోటీగా తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ స్కూల్స్ సైన్స్ జర్నల్ లో తన రీసెర్చ్ పేపర్ ను అందించారు. మరి తొందరలోనే గూగుల్ ను తలదన్నే కొత్త సెర్చింజన్ మన ముందుకు రావాలని ఆశిద్దాం. అలాగే మన వాడికి మనందరి తరఫున ఆల్ ది బెస్ట్ చెబుదాం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Google  Search Engine  Anmol Tukrel  Google search engine  anmol  tech news  

Other Articles