Pawan coutner attacks Yanamala on land acquisition

Pawan kalyan stern reactions on yanamalas comments

pawan kalyan stern reactions on yanamalas comments, Pawan yanamala counters land acquisition, land pooling pawan, AP Land acquisition act, AP capital land pooling, yanamala land acquisition counter, TDP government pawan, yanamala pawan, pawan counter, ap capital city, yanamala ramakrishnudu comments

Pawan coutner attacks Yanamala on land acquisition saying making fun of farmers is not right. Farmers believe that, Pawan is the only option to save their lands.

త్వరలో రాజధాని ప్రాంత రైతులను కలవనున్న పవన్ కల్యాన్..

Posted: 08/20/2015 05:28 PM IST
Pawan kalyan stern reactions on yanamalas comments

నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీని అధికారానికి దెగ్గర చేయడంలో తనవంతు ప్రాత ఎంతో వున్నా.. దానిని పక్కన బెట్టి.. కేవలం రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్.. మరోమారు రైతులను క్షేత్రస్థాయిలో కలవనున్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా తన పర్యటన విషయాన్ని వెల్లడించారు. అమరావతి ప్రాంత రైతుల భూములను తీసుకునే ప్రక్రియలో భాగంగా అక్కడి రైతుల సమస్యలను పరిష్కరించాలని, అంతేకాని బలవంతంగా భూసేకరణ చట్టం మాటున భూములను సేకరించరాదని చెప్పిన పవన్.. ఇప్పుడు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దం కానున్నాడు. రాజధాని ప్రాంత రైతుల అవేదనను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో మంత్రి నారాయణ ఒక మెలిక, ఆ తరువాత ఏకంగా సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు మరోలా వెటకారంగా స్పందించడంపై పవన్ ధీటుగా సమాధానం ఇచ్చాడు.

తాను ఎంతో బాధ్యతతో రైతుల సమస్యను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లానని, కానీ దానిపై విజ్ఞతతో స్పందించడం మానేసి రైతుల ఆవేదనను వెటకారం చెయ్యడం తెలుగుదేశం ప్రభుత్వానికి, ప్రభుత్వంలోని మంత్రులకే చెల్లిందని దుయ్యబట్టారు. ఎలా చెయ్యాలో పవనే చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై పవన్ మళ్లీ ట్విట్టర్ ముఖంగా స్పందించారు. అసలు అక్కడ కట్టేది స్వర్గం అని తెలిస్తే.. అది త్రిశంకు స్వర్గమా..? లేక సాధారణ స్వర్గమా..? అనేది తర్వాత అలోచించవచ్చన్నారు. సినిమా పరిశ్రమకు హైదరాబాద్లో ఇచ్చినవి కొండలు తప్ప బహుళ పంటలు పండే పొలాలు కాదని, ఇది రామకృష్ణుడు గారికి తెలియదనుకుంటా..? అని పవన్ ఎద్దేవా చేశారు. పైగా.. హైదరాబాద్ కొండల్లో కానీ, విశాఖపట్నం కొండల్లో కానీ తనకైతే స్టూడియోలు లేవని కూడా స్పష్టం చేశారు. తాను త్వరలోనే బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నదీ పరివాహక గ్రామాల రైతులను కలుస్తానని చెప్పారు.

పవన్ కల్యాన్ ఈ మేరకు ట్వట్టర్ లో స్పందించగానే రాజధాని ప్రాంత రైతులు.. స్వచ్చంధంగా రోడ్డలపైకి వచ్చారు. ఎక్కడకక్కడ రైతులు, జనసేన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పవన్ కల్యాన్ అభిమానులు ఆయన చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించారు. ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన మూలవిరాట్.. మాటకు కూడా అధికారంలో వున్న వ్యక్తులు విలువనీయకుండే.. ప్రభుత్వాన్ని కూలదోస్తామని వారు తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం పవన్ కల్యాన్ అని, ఆయన తమకు మద్దతుగా నిలవడం హర్షనీయమన్నారు. అయినా ప్రభుత్వం మొండిగా తమపై భూసేకరణ చట్టాన్ని అమలుచేస్తోందని రైతులు తమ అవేదనను వ్యక్తం చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  land acquisition  yanamala  

Other Articles