ysrcp mp mithun reddy challenges chandrababu over special status for ap

Special status not possible to ap centre clears again

andhra pradesh, special status, YSRCP, Mithun Reddy, TDP, special status not possible to AP, chandrababu Naidu, AP government, NDA government, Congress

Letter from Union Ministry of commercial Industries to YSRCP party states that special status not possible to AndhraPradesh

ఏపీకి హోదా సాధ్యంకాదు.. స్పష్టం చేసిన ప్రధాని కార్యాలయం లేఖ

Posted: 08/15/2015 03:53 PM IST
Special status not possible to ap centre clears again

రాష్ట్ర పునర్విభజనతో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితితో ఇవ్వడం కుదరదని కేంద్ర మరోమారు తేల్చి చెప్పింది. ప్రత్యేక హోదాపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ నుంచి వైఎస్ జగన్ కు లిఖితపూర్వక లేఖ వచ్చింది.  రాష్ట్రాన్ని పారిశ్రామికంగా రాష్ట్ర నాయకులే అభివృద్ధి చేసుకోవాలని పేర్కోంది. విభజన చట్టంలోని అన్ని అంశాలు అమలు చేశామని, అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీకి న్యాయం చేస్తామని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి  ధ్రువీకరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా  అంశంపై ప్రధాని కార్యాలయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి  ఓ లేఖ వచ్చినట్లు ఆయన తెలిపారు.  

శనివారం పార్టీ కార్యాలయంలో మిథున్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఏపీకి ప్రత్యేక హోదా లేదు కాబట్టి ప్రోత్సహకాలు ఇవ్వలేమని ఆ లేఖలో కేంద్రం పేర్కొందని, ఇవ్వాల్సిన ప్రోత్సహకాలు ఇప్పటికే ఇచ్చాం కాబట్టి కొత్తగా ఏమీ ఇవ్వబోమని లేఖలో కేంద్రం పేర్కొన్నట్లు మిథున్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వైఎస్ జగన్కు  కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఆశిష్ దత్తా లేఖ రాసినట్లు మిథున్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీలు  ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వబోమని కేంద్రం స్పష్టంగా చెప్పినా టీడీపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.  'చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే సత్తా మీకుందా?...మీరెప్పటిలోగా తెస్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మీరు పోరాటానికి సిద్ధమా?' అని ఆయన సూటిగా ప్రశ్నలు సంధించారు.  ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ సీపీ ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ బంద్కు ప్రజలంతా సహకరించాలని మిథున్ రెడ్డి కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh  special status  YSRCP  Mithun Reddy  TDP  

Other Articles