husband cheats wife gets second marriage

Husband decieves wife with another marrriage

husband, wife, cheats, second marriage, hyderabad, banjara hills, husband cheats wife, husband decieves wife, husband marries another girl, pregnant wife went for delivery, second marriage

husband decieves wife with another marrriage after she goes to her home town for delivery

సతి ఊరెళ్లగానే.. పతి మరో యువతికి మొగుడయ్యాడు..!

Posted: 08/15/2015 08:31 PM IST
Husband decieves wife with another marrriage

తాను ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో భర్త మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నంబర్-11లో నివసించే ఎం. నరేష్(26) చర్చి పాస్టర్‌గా పని చేస్తూ 2010లో బోరబండ స్వరాజ్ నగర్‌కు చెందిన హెలెన్ గ్లోరీని పెళ్లి చేసుకున్నాడు. వారికి కొడుకు, కూతురు ఉన్నారు. కాగా ఇటీవల గ్లోరీ ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. అయితే ఇళ్లకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించే నరేష్ రాంనగర్‌లో ఉండే ఆలివ్ అలియాస్ డింపుల్‌పై మోజు పెంచుకున్నాడు. దీంతో మూడు రోజుల క్రితం ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న గ్లోరీ తండ్రితోపాటు కుటుంబ సభ్యులు శనివారం బంజారాహిల్స్‌లోని నరేష్ ఇంటి వద్దకు వచ్చి, ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వారు కుక్కలను ఉసిగొల్పటంతో నరేష్ పరుగు లంకించుకుని త్రుటిలో తప్పించుకున్నాడు. తీవ్ర ఉద్రిక్తత నడుమ నరేష్, అతని రెండో భార్య ఆలివ్ ప్రాణ రక్షణ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తనకు విడాకులు ఇవ్వకుండానే, వంచించి మరో పెళ్లి చేసుకున్నాడంటూ నరేష్ మొదటి భార్య గ్లోరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్టేషన్‌లో కూడా రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband  wife  cheats  second marriage  hyderabad  

Other Articles