PM Modi speaks out against corruption, says need to focus on 'Start-Up' and 'Stand-Up' India

Swachh bharat campaign our biggest success modi

69th Independence Day, Narendra Modi, Rajnath Singh, patriotism, Red Fort, Independence Day, celebration, One Rank One Pension,PM Modi OROP,Red Fort,Ex-servicemen,Independence Day,PM Modi

In a marathon address to the nation from the ramparts of Red Fort, PM Modi on Saturday underlined India's unity and diversity and said the poison of casteism and communal frenzy have no place in the country.

ఐక్యతే మన బలం.. దానిని పరిరక్షించాలని ప్రధాని పిలుపు

Posted: 08/15/2015 11:31 AM IST
Swachh bharat campaign our biggest success modi

ప్రాణాలను పణంగా పెట్టి, జీవితాలను త్యాగం చేసి బ్రిటిష్ పాలన నుంచి జాతికి విముక్తి ప్రసాదించిన స్వాతంత్ర్య సమరయోధులకు సెల్యూట్‌ చేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎందరో సమరయోధులు వారి జీవితాలను కారాగారాలకు అంకితం చేసి స్వాతంత్య్రాన్ని మనకు కానుకగా అందించారన్నారు. 69వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఇదేరోజున అవతరించిందని ఆయన దేశ ప్రజలకు గుర్తుచేశారు. మహాపురుషుల పోరాట ఫలితమే స్వతంత్ర భారతమంటూ వారి త్యాగాలను నిత్యం స్మరించుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.

దేశ సమగ్రతకు జాతి ఐక్యతే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ధేశఐక్యతకు దెబ్బ తగిలితే కలలు చెదిరిపోతాయని హెచ్చరించారు. సమరయోధుల త్యాగ ఫలితమైన ఈ స్వాతంత్ర్యపు నిజమైన అర్థాన్ని గ్రహించాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న భారత తత్వమే ప్రపంచానికి దిక్సూచిగా ఉందన్నారు.దేశంలో ఒక ఉద్యమంగా వ్యాపించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్‌ ప్రతి భారతీయుడినీ కదిలించిందని చెప్పారు. గతంలో తాను ఎర్రకోట నుంచి మరుగుదొడ్ల గురించి మాట్లాడితే ఈయనేం ప్రధాని అంటూ ఎద్దేవా చేశారన్నారు.

ఇప్పుడు చిన్నారులే స్వచ్ఛ భారత్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారంటూ ఇళ్లను స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను బాలలు స్వీకరించారని వారిని అభినందించారు. అటువంటి బాలలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. కులతత్వం, మతతత్వం దేశాన్ని పట్టి పీడిస్తున్నాయన్న ప్రధాని, అభివృద్ధి నినాదంతో వీటన్నింటినీ భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ మతఛాందసానికి ఎటువంటి పరిస్థితుల్లో తావుండకూడదని స్పష్టం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 69th Independence Day  Narendra Modi  Red Fort  

Other Articles