Sania gets Khel Ratna, 17 others get Arjuna award

Official khel rathna arjuna awards 2015 winners list

Tennis star Sania Mirza, Khel Ratna award, Rajiv Gandhi Khel Ratna award, Arjuna awards, sport, tennis player, star cricketer Rohit Sharma, ace shooter Jitu Rai, kidambi srikanth, sportspersons Arjuna awards

Sania Mirza’s name was on Friday officially approved for the coveted Rajiv Gandhi Khel Ratna award, becoming only the second tennis player to be nominated for the highest sporting honour.

సానియాకు ఖేల్ రత్న, రోహిత్, శ్రీకాంత్ లకు అర్జునా.. అధికారిక వెల్లడి

Posted: 08/14/2015 11:54 PM IST
Official khel rathna arjuna awards 2015 winners list

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. క్రీడాకారులకు లభించే అత్యున్నత పురస్కారం 'రాజీవ్ ఖేల్ రత్న'ను ఆమె దక్కించుకుంది. ఈ మేరకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్నా అవార్డు సహా అర్జునా అవార్డులను అందుకునే వారి జాబితాను అధికారికంగా ప్రకటించింది. సానియా మిర్చాకు రాజీవ్ ఖేల్ రత్నా అవార్డును అందజేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన.. అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడంతో ఖాయమైంది. ఇక బ్యాడ్మింటన్ తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, షూటింగ్ విభాగంలో నిపుణుడు జీతురాయ్ సహా 17 మందికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అర్జున అవార్డులు ప్రకటించింది.

కేంద్ర జాబితాలో అర్జున అవార్డు దక్కిన వారు వీరే..

* రోహిత్ శర్మ              -క్రికెట్
* కిదాంబి శ్రీకాంత్          -బ్యాడ్మింటన్
* పీఆర్ శ్రీజేష్               -హాకీ
* దీపా కార్మకర్            -జిమ్నాస్టిక్స్
* జీతురాయ్               -షూటింగ్
* సందీప్ కుమార్        -విలువిద్య
* మన్ దీప్ జంగ్రా        -బాక్సింగ్
* బబిత                       రెజ్లింగ్
* భజరంగీ                   -రెజ్లింగ్
* స్వర్ణ్ సింగ్ విర్క్        -రోయింగ్
*సతీష్ శివలింగం        -వెయిట్ లిఫ్టింగ్
* -యుమ్నమ్ సంతోయి దేవి    -పుషు
*శరత్ గైక్వాడ్            -పారా సైలింగ్
* ఎం ఆర్ పూర్వమ్మ        -అథ్లెటిక్స్
*మన్జీత్ చిల్లర్             -కబడ్డీ
*అభిలాషా మాత్రే        -కబడ్డీ
* అనూప్ కుమార్ యామా    -రోలర్ స్కేటింగ్

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles