Andhra Pradesh | Chief Minister | National Flag | Vizag | Chandrababu Naidu

Andhra pradesh chief minister unfurls national flag on coast in vizag

Andhra Pradesh,Andhra Pradesh Chief Minister,N Chandrababu Naidu,Ramakrishna Beach road,Independence Day,Andhra Pradesh Independence Day Celebrations

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu unfurled the national flag on the sea coast in Visakhapatnam today to mark India's 69th Independence Day.

కేంద్ర సహకారంతో రాష్ట్రాభివృద్ధి.. మోడీ సహాకరిస్తారని చంద్రబాబు ధీమా

Posted: 08/15/2015 11:37 AM IST
Andhra pradesh chief minister unfurls national flag on coast in vizag

విభజన తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో దేశ 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా, పద్ధతి లేకుండా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల కలిగిన నష్టాలను అధిగమించి, ఇతర రాష్ట్రాలతో పోటీ పడేవరకు కేంద్రం తమకు అన్ని విధాలా సహకరించాల్సి ఉందన్నారు ఏపీ సీఎం. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తగిన సహకారం అందజేస్తారని ఆశిస్తున్నామన్నారు.

గతంలో కరెంట్ కోతలతో విలవిలలాడిన ఏపీని విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దగలిగామన్న ముఖ్యమంత్రి, పోలవరం పూర్తికావడానికి మరో నాలుగైదేళ్లు పడుతుందన్నారు. అయితే, అంతకన్నా ముందే కృష్ణా - గోదావరి నదీ జలాలను అనుసంధానిస్తామని, దానిలో భాగంగానే పట్టిసీమ ఎత్తిపోతలను ప్రారంభించామని చెప్పారు. పట్టిసీమను ఈరోజు జాతికి అంకితం చేస్తున్నామన్నారు. నదులను అనుసంధానం చేసుకుని ఏపీని కరువురహిత రాష్ట్రంగా చేస్తామంటూ తద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌తో ముడిపడిన ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత ఎన్డీయేదేనన్న చంద్రబాబు, రూ.25వేల కోట్ల మేర రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు. ఎంతోమంది త్యాగాల ఫలితమే నేడు మనం చూస్తున్న భారతదేశమని పేర్కొన్న చంద్రబాబు, బానిసత్వం నుంచి విముక్తి పొందిన ఈ రోజు పర్వదినమన్నారు. అమరుల త్యాగాలు వృథా పోనివ్వకూడదంటూ, మహనీయుల అడుగుజాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగ సమాజాన్ని పీడిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకు అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తామన్నారు. అందుకు నిదర్శనంగానే విశాఖపట్టణంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్రిటిష్‌ పాలకులపై అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేసిన నేల.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని నినదించిన నేల ఇదేనని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ కిందటేడాది ఈ మహానగరాన్ని అతలాకుతలం చేసిన హుద్‌హుద్‌ తుఫాను వల్ల ప్రాణనష్టం జరగకుండా చూశామన్నారు. తొమ్మిది రోజుల పాటు బస్సులో ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించామని చెప్పారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Independence Day  Andhra Pradesh  

Other Articles