modi | bihar | nitesh | lalu prasad

Pm narendra modi addresses parivartan rally in bihars gaya

modi, bihar, nitesh, lalu prasad yadav, Central govt, elections, Bihar elections

PM Narendra Modi Addresses Parivartan Rally in Bihars Gaya Prime Minister Narendra Modi held a rally in Gaya today to give a boost to the Bharatiya Janata Party's campaign in Bihar ahead of the Assembly polls scheduled in the state for later this year.

బీహార్ లో ఆటవిక పాలన సాగింది: మోదీ

Posted: 08/09/2015 05:49 PM IST
Pm narendra modi addresses parivartan rally in bihars gaya

బీహార్‌లో మరోసారి ఆటవిక పాలన తెచ్చేందుకు లాలూ, నితీశ్ లు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ప్రధాని మోడీ. బీహార్‌లో మార్పు కోసం ఉద్యమం పేరుతో బీజేపీ పరివర్తన యాత్రలు చేపట్టింది. గయలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొన్నారు. బీహార్‌లో ఆటవిక పాలనకు చరమాంకం పలకాల్సిన సమయమొచ్చిందన్న మోడీ... కేంద్రం బీహార్ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. దృఢమైన, మార్పుతో కూడిన బీహార్‌ను నిర్మిస్తామన్నారు మోడీ. భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీహార్ ప్రజలు, ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. బీహార్ మాత్రం అభివృద్ధి చెందట్లేదు? ఎందుకో మీరే చెప్పండి.

బీహారీల కలలను ఎవరు నాశనం చేస్తున్నారు? బీహార్‌లో ఎవరు ఆటవిక రాజ్యం తెచ్చారు? బీహార్‌ను కాపాడాలా వద్దా? కొత్త బీహార్‌ను తయారుచేయాలా వద్దా? బీహార్‌ను ముందుకు తీసుకెళ్లాలా వద్దా? అందుకు మేము సిద్ధంగా ఉన్నాం.  బీహార్‌ను అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని స్పష్టం చేశారు. అందు కోసం ఆ రాష్ట్ర ప్రజలు రెండు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఒకటి అభివృద్ధి, రెండోది మార్పుతో కూడిన బీహార్ అని తెలిపారు. మార్పు కావాలని బీహార్ ప్రజలు నిశ్చయించుకున్నారని పేర్కొన్నారు. ప్రతీ రాష్ట్రంలో బీహార్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారని వెల్లడించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలు గతంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నాయని వివరించారు. బీజేపీ పాలనలో రెండు రాష్ర్టాలు అభివృద్ధి దిశగా పయనించాయని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  bihar  nitesh  lalu prasad yadav  Central govt  elections  Bihar elections  

Other Articles