Pawan Kalyan | Muni Koti | Chandrababu

Pawan kalyan nd many others respond on death of muni koti

Pawan Kalyan, Muni Koti, Chandrababu, AP, Special status, Venkiah Naidu, Raghuveera

Pawan kalyan nd many others respond on death of muni koti. Pawan kalyan respond in his twitter account. Venkiah Naidu and chandrababu naidu and many others respond on muni koti death.

మునికొటి మరణంపై స్పందించిన పవన్ కళ్యాణ్.. తదితరులు

Posted: 08/09/2015 05:16 PM IST
Pawan kalyan nd many others respond on death of muni koti

తిరుపతి యువకుడు మునికోటి మృతిపై పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. మునికోటి మృతి తనకు చాలా బాధ కలిగించిందని పవన్ అన్నారు. మునికోటి కుటుంబానికి పవన్ తన ప్రగాఢ సానుజబూతి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాపై ఏమీ మాట్లాడలేనని పవన్ ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం మునికోటి అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఒంటికి నిప్పటించుకోవడంతో తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశాడు.

ప్రత్యేక హోదా కోసం మునికోటి మరణించడం దురదృష్టకరమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఏపీకి న్యాయం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్‌ అసమగ్రంగా రాష్ట్రాన్ని విభజించడం వల్లే సమస్య తలెత్తిందన్నారు. మునికోటి మరణించడంపై ఏపీ సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు.ప్రత్యేక హోదా కోసం మంత్రివర్గ సభ్యులతో కలిసి ప్రధాని మోడీతో చర్చిస్తామన్నిరు. ఉద్వేగాలకు, భావోద్వేగాలకు లోనుకావద్దని కోరారు.ఆయన కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు చంద్రబాబు.

కోటి మృతి పట్ల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. కోటి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.ప్రత్యేక హోదా విషయమై ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని,ఆత్మహత్యలకు పాల్పడవద్దని జగన్ కోరారు. కోటి మృతిపై సోనియా గాంధీ,రాహుల్‌ సంతాపం తెలిపారు.ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి కోటి మృతి పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.ఎన్నికల హామీలో భాగమైన ప్రత్యేక హోదాను ప్రకటించేందుకు కేంద్రం కుంటి సాకులు చెబుతోందన్నారు.బీజేపీ, టీడీపీలు కలిసి ఏపీ ప్రజల్ని మోసం చేస్తున్నాయన్నారు రఘువీరా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Muni Koti  Chandrababu  AP  Special status  Venkiah Naidu  Raghuveera  

Other Articles