Babu Rao | Rishiteshwari | Dismiss | Ap

Ap govt dismissed nagarjuna university college principal for rishiteshwari suicide

Rishiteshwari, Rishiteshwari Suicide, Rishiteshwari death, Babu Rao, Nararjuna University, ganta Srinivas

AP govt dismissed Nagarjuna University college principal for Rishiteshwari suicide. Nagarjuna University college principal Babu Rao dismissed.

రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ డిస్మిస్.. ప్రభుత్వంలో కదలిక

Posted: 08/09/2015 06:19 PM IST
Ap govt dismissed nagarjuna university college principal for rishiteshwari suicide

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి సూసైడ్ ఘటన కేసులో వర్సిటీ ప్రిన్సిపాల్ బాబూరావుని ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపిన సుబ్రహ్మణ్యం కమిటీ పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదిక అందిన తర్వాత ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రిషితేశ్వరి మృతికి కారణమైన వారిని వదిలేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ర్యాగింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే షీ టీమ్ లను రంగంలోకి దించుతామని మంత్రి గంటా వెల్లడించారు. మరోవైపు ర్యాగింగ్ పై విద్యార్థులకు సెలబ్రటీలతో అవగాహన కల్పిస్తామన్నారు.

రాష్ట్రంలో ర్యాగింగ్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.  రిషితేశ్వరి మృతిపై సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను మంత్రి వెల్లడించారు. ఈ కేసులో భాగంగా 170 మంది విద్యార్థులను, కలెక్టర్, ఆర్డీవో, ఎస్పీ, రిషితేశ్వరి తల్లిదండ్రులతో పాటుగా, నిందితుల తల్లిదండ్రులను కూడా కమిటీ విచారించిందని మంత్రి తెలిపారు. రిషితేశ్వరి కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీచేయాలని, కేసు విచారణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని సుబ్రహ్మణ్యం కమిటీ సూచించినట్లు మంత్రి చెప్పారు.

కమిటీ సూచనల ప్రకారం... రిషితేశ్వరి కేసును యాంటీ ర్యాగింగ్ చట్టంతోపాటుగా, నిర్భయ, లైంగిక వేధింపుల చట్టాల ఆధారంగా విచారించాలని కమిటీ తన నివేదకలో పేర్కొంది. అన్ని యూనివర్సిటీల్లో కాలేజీలు ప్రారంభమైన తొలినెలలోనే ఫ్రెషర్స్ డే నిర్వహించుకోవాలని, అది కూడా క్యాంపస్ లోపలే పెట్టాలని కమిటీ సూచించింది. అదేవిధంగా యూనివర్సిటీల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంది. బయటి వ్యక్తులను యూనివర్సిటీల్లోకి అనుమతించరాదని, ఇందుకోసం విద్యార్థులకు ఐడీ కార్డులు జారీ చేయాలని సూచించింది. సుబ్రహ్మణ్యం కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేస్తామని, యూనివర్సిటీల్లో మంచి వాతావరణ నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles