Jet Airways unveils ‘Weekend Surprises’, offers flat 15% discount on domestic and international flights

Special weekend fares for jet airways passengers

Special weekend fares for Jet Airways passengers, Jet Airways, Jet Airways Sale, Special weekend offers, Weekend Surprises, Special weekend fares, jet airways flat 15% discount, jet airways domestic and international flights, Jet Airways passengers, jet airways weekend offer, jet airline’s website, jet airways mobile app, Civil avaiation, Company Watch, Jet Airways

Full-service carrier Jet Airways on Friday announced a ticket discount scheme -- Weekend Surprises -- in an attempt to woo flyers with exclusive and special deals every weekend on the airline website and mobile app.

జెట్ ఎయిర్ వేస్ నుంచి విమాన ప్రయాణికులకు మరో డిస్కౌంట్ ఆఫర్

Posted: 07/25/2015 09:29 PM IST
Special weekend fares for jet airways passengers

విమానయాన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ మరో పథకాన్ని ప్రకటించింది. ఇప్పటికే బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ధరలను 50 శాతం వరకు తగ్గించిన ఈ సంస్థ మద్య తరగతి ప్రజలను ఆకర్షించేందుకు మరో కొత్త వీకెండ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ పథకంతో వారాంతపు సెలవులలో సరదాగా విమానయానం చేయాలనుకునే వారికి వీకెండ్‌ ప్రత్యేక ధరలను కూడా అందుబాటులోకి తెచ్చింది. దేశీయ, విదేశీ ప్రయాణికులు వీకెండ్‌లో టికెట్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. జూలై 25-26 నుంచి ఈ కొత్త పథకం ప్రారంభం అవుతుందని పేర్కొంది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లను పొందవచ్చని తెలిపింది. వారాంతంలో టికెట్‌ బేస్‌ ధర, ఇంధన చార్జీలపై 15 శాతం ఫ్లాట్‌ డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చని చెబుతోంది. సంస్థ విమానాలు నడిపిస్తున్న 51 దేశీ, 22 అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు ఈ ఆఫర్‌ను పొందవచ్చని జెట్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ రాజ్‌ శివకుమార్‌ తెలిపారు. టికెట్లు బుక్‌ చేసుకున్న కస్టమర్లు ఆకర్షణీయమైన డిస్కౌంట్‌తో పాటు బోనస్‌ పాయింట్లను కూడా పొందవచ్చని పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jet Airways  Jet Airways Sale  Special weekend offers  

Other Articles