eetala rajender attends grand closing ceremony of godavari pusharaalu

Chandrababu baba ramdev attended to godavari river pushkaraalu closing ceremony

chandrababu, baba ramdev attended to godavari river pushkaraalu closing ceremony, eetala rajender attends grand closing ceremony of godavari pusharaalu, telugu states, andhra pradesh and telangana, godavari river pushkaraalu closing ceremony, godavari pusharaalu

grand closing ceremony of godavari pusharaalu in both telugu states andhra pradesh and telangana

కన్నుల పండుగగా గోదావరి నదీమతల్లి పుష్కరాల ముగింపు వేడుకలు

Posted: 07/25/2015 06:34 PM IST
Chandrababu baba ramdev attended to godavari river pushkaraalu closing ceremony

గోదావరి మహా పుష్కరాల ఘనంగా ముగిసాయి. రాజమండ్రిలోని స్థానిక ఆర్ట్స్‌ కాలేజీలో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బాబా రాందేవ్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో మంగళంపల్లి బాలమురళికృష్ణ కర్ణాటక గాత్ర సంగీతం అందించగా  వెయ్యిమంది కూచిపూడి కళాకారుల నృత్యం చేశారు. ముగింపు వేడుకలను తిలకించేందుకు పలువురు ప్రముఖులతోపాటు ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో కాలేజీ కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా మంగళంపల్లి బాలమురళీ కృష్ణను చంద్రబాబు సత్కరించారు. రాజమండ్రిలో వీఐపీ ఘాట్లో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పుణ్య స్నానం చేశారు. పుష్కరాల ముగింపు వేడుకల సందర్భంగా ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్, లేజర్ లైట్లు, బాణా సంచా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా తెప్పించిన బాణా సంచా కాల్చిన సమయంలో గోదావరి మిరుమిట్లు గొలిపే కాంతులతో మెరిసిపోయింది.

అటు తెలంగాణలోనూ గోదావరి మహా పుష్కరాలు ఘనంగా ముగిసాయి. గోదావరి తల్లికి పుష్కరాల ముగింపు సందర్భంగా మంగళ హారతినిచ్చారు. బాసరలోని సరస్వతి మాతా మందిరం నుంచి పుష్కర ఘాట్ వరకు శోభాయాత్రను నిర్వహించారు. ఇటు ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహ ఆలయం నుంచి, భద్రాద్రిలో శ్రీ సీతాసమేత రామలక్ష్మణ వారి ఆలయం నుంచి, పోచంపాడ్ లలో ను రాముల వారి ఆలయం నుంచి, కాళేశ్వరస్వామి ఆలయం నుంచి పుష్కరఘాట్ల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ధర్మపురిలో పుష్కర ముగింపు వేడుకలకు మంత్రి ఈటెల, స్వామి స్వరూపానంద తదితరులు పాల్గోన్నారు.

చివరి రోజు సందర్బంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. ఏపీ, తెలంగాణల్లోని గోదావరి పుష్కర ఘాట్లలో భక్తులు కిటకిటలాడారు. రాజమండ్రి, నర్సాపురం, కొవ్వూరు పుష్కరఘాట్లు భక్తులతో కోలాహలంగా మారాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలోని కేదార్‌ఘాట్‌, కోడేరు ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తులు బారులు తీరారు. కాళేశ్వరంతో పాటు అదిలాబాద్ జిల్లా బాసర ఆలయానికి భక్తజనం బారులు తీరారు. కోటి లింగాల, ధర్మపురి, పోచంపాడ్, సహా అన్ని గోదావరి నదీ పరివాహిక జిల్లాలకు తండోపతండాలుగా భక్తజన సందోహం హాజరై పుణ్యసాన్నాలను ఆచరించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles