parliamant sessions | Telangana | AP | Sujana chowdary, kavitha, Special status

What will telangana and ap mps do in this parliament sessions

Parliament, parliamant sessions, Telangana, AP, Sujana chowdary, kavitha, Special status

What will Telangana and ap MPs do in this Parliament sessions. From today onwards parliament sessions for 21 days. Telangana and ap mps are getting to ready to make a voice in the parliament for their states.

తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఏం చేస్తారో...!

Posted: 07/21/2015 11:02 AM IST
What will telangana and ap mps do in this parliament sessions

నేటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మోదీ ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరుతూ దాడికి సిద్దంగా ఉన్నాయి ప్రతిపక్షాలు. అయితే ఈ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఏం మాట్లాడతారు..? కేంద్రం నుండి ఎంత వరకు బెనిఫిట్ పొందగలరు..? ఎవరు మాట్లాడతారు?? ఇలా చాలా ప్రశ్నలు తెలుగు ప్రజలను వేధిస్తున్నాయి. అయితే పార్లమెంట్ లో ఏపికి ప్రత్యేక హోదా మీద మాట్లాడతామని, ఏదో రకంగా హామీ మీద మాట్లాడిస్తామని ఏపికి చెందిన తెలుగుదేశం నాయకులు పట్టుమీదున్నారు. అయితే పార్లమెంట్ లో మన వాళ్లు నిజంగా మాట్లాడతారా..? లేదా కాగితపు పులుల్లా మారతారా..? అన్నది చూడాలి.

Also Read:  నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు.. దాడికి అన్ని పక్షాలు సిద్దం

తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి పార్లమెంట్ సమావేశాల్లో ఏపి ఎదర్కొంటున్న సమస్యల మీద చర్చిస్తామని ముందు నుండి చెప్పుకొస్తున్నారు. మరి సుజనా గారు మాట్లాడతారో లేదంటే మనకెందుకులే అని ఊరుకుంటారో చూడాలి. అయితే మన పక్కనున్న తమిళనాడు రాష్ట్రాన్ని చూసి మనం బుద్ది తెచ్చుకోవాలి.. కేంద్రాన్ని ముక్కు పిండి తాము కోరిందాన్ని సాధించుకునే తమిళుల ముందు తెలుగు వారు ఎందుకు పని రారు. అసలు రాజకీయంగా చూసినా, అభివృద్దిలో చూసినా వారే మన కన్నా ముందుంటారు. కానీ మన తెలుగు వారు మాత్రం వాళ్లను చూసి ఏమీ నేర్చుకోవడం లేదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉంది. అలాంటప్పుడు బాగా వత్తిడి తీసుకురాగలిగితే ఎంతో కొంత లాభం చేకూరుతుందన్న మాట వాస్తవం. కానీ మన వాళ్లు ఎంత వరకు అందులో సఫలీకృతం అవుతారో చూడాలి.

Also Read:  ఏపికి ప్రత్యేక హోదా పక్కా అంటున్న కేంద్ర సహాయ మంత్రి

ఇక తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోంది అంటూ తెలంగాణ నేతలు అంతెత్తున లేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సిందిపోయి ఇలా పక్షపాత వైఖరిని ప్రదర్శించడం మీద విమర్శల వర్షం కురిపిస్తోంది. అయితే మరి తెలంగాణ నేతలు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎలా స్పందిస్తారు..? కేంద్రం నుండి ఎలాంటి హామీలు రాబడతారు అన్నది చూడాలి. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేంద్రం నుండి భారీగా నిధులు వస్తాయని ఊహిస్తోంది. కానీ తెలంగాణ తరఫున పార్లమెంట్ లో గొంతెత్తే వాళ్లు ఎవరు..? ఎలాంటి అంశాలను పార్లమెంట్ లోచర్చిస్తారు..? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో సమాధానం లభిస్తుంది. వీలైనంత వరకు రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రం నుండి వీలైనన్ని హామీలు, నిధులు రాబట్టాలని ఆశిద్దాం.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parliament  parliamant sessions  Telangana  AP  Sujana chowdary  kavitha  Special status  

Other Articles