Parliament | Sessions | Modi | NDA | Venkiah Naidu | Smithi Irani, lalith Modi, Land bill

Parliament braces for storm as monsoon session begins today

Parliament, Sessions, Modi, NDA, Venkiah Naidu, Smithi Irani, lalith Modi, Land bill

Parliament braces for storm as Monsoon Session begins today On the eve of Parliament's 21-day Monsoon Session, the ruling NDA unanimously decided not to turn down the Opposition's demands for the resignation of the four top BJP leaders who are beleaguered by scandals. The meeting was chaired by Prime Minister Narendra Modi, who also met the leaders of all parties earlier

నేటి నుండి పార్లమెంట్ సమావేశాలు.. దాడికి అన్ని పక్షాలు సిద్దం

Posted: 07/21/2015 08:46 AM IST
Parliament braces for storm as monsoon session begins today

సమరానికి అంతా సిద్దమైంది.. ఈ ఉదయం నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సామావేశాల్లో అధికార పక్షం ఆటకట్టించాలని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని అధికార పక్షం సిద్దంగా ఉన్నాయి. మోదీ, ఎన్డీయే ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరుతున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. నేటి నుండి ప్రారంభం కానున్న సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అధికార, విపక్ష పార్టీల మధ్య సయోధ్య సాధ్యపడలేదు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్రమోదీ చేసిన విజ్ఞప్తిని విపక్షాలు తిరస్కరించాయి.

Also Read:  సీఎం చౌహాన్ కూడా వ్యాపం కుంభకోణంలో దోషే

అయితే లలిత్ మోదీ , వ్యాపం కుంభకోణం నేపథ్యంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు బీజేపీ నేతలెవరూ రాజీనామా చేసే ప్రసక్తేలేదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. . పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయాలన్న కాంగ్రెస్ వైఖరితో 29 విపక్ష పార్టీలు విభేదించాయని, సమావేశంలో ఆ పార్టీ ఒంటరయ్యిందని చెప్పారు. సుష్మ, స్మృతి ఇరానీలపై ప్రతిపక్షాలు లేవనెత్తే వాదనలపై ఆ మంత్రులే స్పష్టమైన సమాధానం చెప్తారని పేర్కొన్నారు. లలిత్‌గేట్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరారాజే, వ్యాపం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, నకిలీ డిగ్రీ పట్టా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలను పదవుల నుంచి తప్పించాల్సిందేనని విపక్షాలన్నీ పట్టుబట్టాయి.

Also Read:  లలిత్ మోదీ, వసుంధర రాజే ఓ లేఖ

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ని పదవి నుండి తప్పించే వరకు సభను నడువనిచ్చే ప్రసక్తేలేదని కాంగ్రెస్ తెగేసి చెప్పింది. విపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. ఎవరూ రాజీనామా చేయబోరని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. పార్లమెంటును ఎవరూ నియంత్రించలేరని పేర్కొన్నారు. కాగా, వివాదాస్పద భూసేకరణ చట్టసవరణ బిల్లును ఈ సమావేశాల్లోనే సభ ముందు పెట్టనున్నట్లు ప్రధాని సంకేతాలిచ్చారు. అఖిలపక్ష సమావేశంలో 29 పార్టీలకు చెందిన 42 మంది పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్, అన్నా డీఎంకే హాజరుకాలేదు. మరి నేటి సమావేశం ఎంత హాట్ హాట్ గా సాగుతుందో చూడాలి. అయితే భూసేకరణ చట్టాన్ని తేవాలని ఎన్డీయే ప్రభుత్వం ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నా.. అది సాధ్యపడటం లేదు.. మరి ఈ సారి పార్లమెంట్ సమాదేశాల్లో చట్టాన్ని తీసుకువస్తారో లేదా గతంలోలాగానే ఆర్డినెన్స్ తో సర్దిపెడతారో చూడాలి.

Also Read:  అబ్బా వెంకయ్యా.. మాట భలే మారుస్తామయ్యా..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parliament  Sessions  Modi  NDA  Venkiah Naidu  Smithi Irani  lalith Modi  Land bill  

Other Articles