Revanth Reddy Given A Shocking Statement About Harish Rao | Revanth Interview | Cash For Vote

Revanth reddy controversial interview about harish rao

revanth reddy, harish rao, cash for vote, revanth controversy, revanth interview, revanth abn interview, revanth reddy latest news, revanth reddy cash for vote, tdp party, trs party, trs akarsh

Revanth reddy controversial interview about harish rao : Ttdp Mla Revanth Reddy Given A Shocking Statement About Harish Rao in an interview.

రేవంత్ రెడ్డికి బంపరాఫర్ ఇచ్చిన హరీశ్ రావు

Posted: 07/21/2015 10:54 AM IST
Revanth reddy controversial interview about harish rao

టీఆర్ఎస్, టీడీపీ పార్టీల మధ్య వున్న వైరుధ్యం ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవకాశం వస్తే చాలు.. ఒకదానిమీద మరొక పార్టీ దుమ్మెత్తిపోసుకుంటుంటాయి. ఆ పార్టీ అధినేతల నుంచి కార్యకర్తల వరకు తారాస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటారు. ఇక హరీశ్ రావు, రేవంత్ రెడ్డిలు అయితే.. మాటల తూటాలు పేల్చడంలో నేనంటే నేనంటూ పోటీపడుతుంటారు. ముఖ్యంగా హరీశ్ రావు టీడీపీ పార్టీపై సెటైర్లు వేయడంలో తనకు తానే సాటి! అటువంటి ఆయన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ కి ఓ బంపరాఫర్ ఆఫర్ ఇచ్చారని సమాచారం. అవును... అందరికీ షాక్ కి గురిచేసే ఈ విషయాన్ని రేవంత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ.. ఇతర పార్టీ నేతలను తమ పార్టీవైపు ఆకర్షించుకోవడానికి ‘ఆకర్ష్’ మంత్రాన్ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే! తెలంగాణలో తమ పార్టీ బలాన్ని పెంచుకోవడం కోసమే టీఆర్ఎస్ ఆ పథకాన్ని ప్రయోగిస్తోంది. ఇప్పటికే ఆ ‘ఆకర్ష్’ మంత్రాన్ని ఎంతోమంది నేతలపై విసిరిన టీఆర్ఎస్ పార్టీ.. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డిపై కూడా వల వేసిందట. ఆయా నేతల స్థాయికి బట్టి, వారికి సరితూగే నేతల్ని టీఆర్ఎస్ రంగంలోకి దించుతుండగా... రేవంత్ కు ఈ తరహా ఆఫర్ చేసేందుకు స్వయంగా తెలంగాణ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు రంగంలోకి దిగారట. ఈ మేరకు రేవంత్ రెడ్డే ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అయితే.. హరీశ్ రావు తనకు ఇచ్చిన ఆఫర్ ఏమిటో, ఆయన ఏం చెప్పారోనన్న విషయాలను వెల్లడించేందుకు మాత్రం రేవంత్ ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అలాంటి విషయాలను బహిరంగంగా చర్చించేందుకు తనకిష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ.. అవకాశం దొరికినప్పుడు ఆ విషయాలను తప్పకుండా బహిర్గతం చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ ఈ విధంగా హరీశ్ రావు గురించి మాట్లాడటంతో.. రాజకీయవర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  harish rao  trs akarsh  

Other Articles