Ap | Special status | Sujana chowdary | Modi, Central govt, NDA, Chandrababu naidu

Ap will definitely get special status sujana said

Ap, Special status, Sujana chowdary, Modi, Central govt, NDA, Chandrababu naidu

AP will definitely get special status sujana said. TDP Leader Sujana chowdary said that ap will surely get special staus with in one month or one and half month.

ఏపికి ప్రత్యేక హోదా పక్కా అంటున్న కేంద్ర సహాయ మంత్రి

Posted: 07/18/2015 12:31 PM IST
Ap will definitely get special status sujana said

ప్రత్యేక హోదా ఏపి ప్రజలకు అందని ద్రాక్షగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద ఎలాంటి ప్రకటన చెయ్యకపోవడం.. అధికారంలోకి వచ్చి ఇంత కాలం కావస్తున్నా కానీ మోదీ సర్కార్ కనీసం ప్రత్యేక హోదా ఊసెత్తకపోవడం మీద పలు అనుమానాలు వస్తున్నాయి. అయితే లేదు..లేదు..అలాంటిదేమీ లేదు.. ప్రత్యేక హోదా తొందరలోనే వస్తుందని అంటున్నారు ఓ కేంద్ర సహాయ మంత్రి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా త్వరలోనే అది కూడా నెలా, నెలా పదిహేను రోజుల్లో వస్తుందన్నారు  టిడిపి ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి. ఏపికి సంబందించిన పోలవరం ప్రాజెక్టుతో పాటు ప్రత్యే రైల్వే జోన్ విషయాన్ని కూడా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో విజయవాడలో జరిగిన పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు.

Also Read:  ప్రత్యేకహోదా రానప్పుడు కేంద్రంలో మంత్రులెందుకు...?

ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి సుజనా చౌదరి. మరో నెలా, నెలా పదిహేను రోజుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారాయన. దీనిపై కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి 60 శాతం పని పూర్తైందన్న ఆయన...మరో నెలా, నెలా పదిహేను రోజుల్లో స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే గతంలోనూ సుజనా చౌదరి ప్రత్యేక హోదా మీద మాట్లాడారు. కానీ సుజనా చౌదరి చెప్పిన గడువులో కేంద్రం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే మరి ఈసారైనా సుజనా చౌదరి మాటలు నిజమవుతాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Also Read:  మీ పౌరుషం ప్రత్యేకహదా తేవడంపై చూపండి.. నాపై కాదు: పవన్

విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్థలన్నీ రాష్ట్రానికి వస్తాయన్నారు మంత్రి. పోలవరం ప్రాజెక్టుతోపాటు ప్రత్యేక రైల్వే జోన్ విషయాన్ని రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. సెక్షన్ 8 ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ చట్టంలో భాగమన్నారు కేంద్రమంత్రి సుజనా. రాష్ట్ర విభజనానంతరం మిగిలిన ఏపీకి ప్రత్యేక హోదాపై అధికార, విపక్షాల మధ్య ఇప్పటికే మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ప్రత్యేక హోదాపై అలుపెరగకుండా పోరాడుతున్నామని అధికార పార్టీ నేతలు చెబుతుంటే..ఇంకా ఎంతకాలం కాలయాపన చేస్తారంటూ విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇలాంటి టైంలో మరో నెలా, నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా వస్తుందని కేంద్రమంత్రి చెప్పడంతో త్వరలో ఎలాంటి ప్రకటన రాబోతోందన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

By Abhinavachary

Also Read:  ఏపి ప్రత్యేక హోదా లేదు.. నిధులు మాత్రమేనా.?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Special status  Sujana chowdary  Modi  Central govt  NDA  Chandrababu naidu  

Other Articles