kcr calls global hospital doctors and enquires about prathyusha health condition

Chief mininster assures to take care of prathyusha

pratyusha, aware global hospital, KCR couple, CM KCR, Stepmom, Dad Brutally Tortured Pratyusha, high court, uncle, dad, mothers brother, Just for a Flat, aware doctors, pratyusha health bulletin, pratyusha, aware global hospital, heath bulletin, step mother, chamundeshwari, LB nagar police, human rights commision, severe punishment, Girl rescued, Child Rights Group, Child Rights Protection Commission, Child rauma, Torture

Telangana chief mininster K.Chandrashekar Rao assures to take care of prathyusha, calls global hospital doctors and enquires about her health condition

ప్రత్యూష బాగోగులను బాధ్యత నాదేనన్న ముఖ్యమంత్రి

Posted: 07/18/2015 12:12 PM IST
Chief mininster assures to take care of prathyusha

సవతి తల్లి, కన్నతండ్రి హింసకు గురైన ప్రత్యూష జీవితంలో కొత్త కాంతులు నింపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. అందరూ ఉన్నా.. అనాథలా మారిన ప్రత్యూష వేదనను చూసి తీవ్రంగా చలించిపోయిన సీఎం.. ఆమె బాధ్యతలు పూర్తిగా తీసుకోవాలని నిశ్చయించారు. సవతి తల్లి చేతిలో తీవ్ర గాయాలపాలై సరూర్‌నగర్‌లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రత్యూష బాధ్యతలను తామంటే తాము స్వీకరిస్తామంటూ పలువురు ప్రముఖులు ముందుకోస్తున్న తరుణంలో కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి మరీ తెలుసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన సతీసమేతంగా గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషను పరామర్శించనున్నారు

ప్రత్యూషను తన ఇంటికి తీసుకువచ్చి వారం రోజుల పాటు తన వద్దే ఉంచుకోవాలని సీఎం నిర్ణయించినట్లుగా సమాచారం. ప్రత్యూష చదువుసంధ్యల బాధ్యతను ఇకపై తెలంగాణ ప్రభుత్వమే పూర్తిగా తీసుకోనుంది. ప్రత్యూష బాగోగులను తానే స్వయంగా పర్యవేక్షించాలని సీఎం భావిస్తున్నారు. అటు సవతి తల్లి, ఇటు కన్నతండ్రినుంచి నిరాదరణకు గురైన ప్రత్యూష భవిష్యత్ ప్రశ్నార్థకమై ఉన్న తరుణంలో ఆమె బాధ్యత ఎవరు చూడాలన్న విషయంలో హైకోర్టు సైతం దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యూష బాధ్యతలను తాము తీసుకుంటామని పలువురు ప్రముఖులు మంచి మనస్సుతో ముంచుకు వచ్చిన తరుణంలో కేసీఆర్.. ప్రభుత్వ పరంగా తానే అమె బాధ్యతలను స్వీకరిస్తానని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pratyusha  aware global hospital  KCR couple  CM KCR  

Other Articles