pavan kalyan responds on TDP MPs in his latest tweet

Show your anger at the centre not on me says pavan kalyan

show your anger at the centre, not on me says pavan kalyan, kcr steped first for telugu people reunity, pavan kalyan on cash for vote case, section 8, hyderabad, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

actor turned politician jana sena president power star pavan kalyan suggest seemandhra TDP MP to show anger at the center for special status, not on him

మీ పౌరుషం ప్రత్యేకహదా తేవడంపై చూపండి.. నాపై కాదు: పవన్

Posted: 07/08/2015 03:11 PM IST
Show your anger at the centre not on me says pavan kalyan

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ మరోమారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలపై తనదైన శైలిలో స్పందించారు. టీడీపీ ఎంపీలు తనపై చేసిన విమర్శలపై ఆయన మరోమారు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. తెలుగుదేశం ఎంపీలు వ్యాపారం చేయడం తప్పు కాదని అంటూనే.. ప్రజాప్రతినిధులుగా పార్లమెంటులో అడుగుపెట్టిన ఎంపీలు.. వ్యాపారాలు మాత్రమే చేసుకోవడం.. ప్రజా సమస్యలను పక్కన బెట్టడం తప్పుగా పేర్కోన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న తన వ్యాఖ్యల వెనుకనున్న ఉద్దేశ్యాన్ని మరచి.. తనను విమర్శించడం మంచికాదన్నారు.

రాష్ట్ర హితం కోసం, భావితరాలు, బంగారు భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పాటుపడాలన్నారు. తనపై విమర్శలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు చూపిన శ్రద్ద.. ప్రత్యేక హోదా కోసం చూపిస్తే బాగుంటుందని సూచించారు. తనను తిడితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని అన్నారు. సీమాంధ్ర ఎంపీలు తమ పౌరుషాన్ని తనపై కాకుండా కేంద్ర వద్ద చూపితే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాకరమవుతుందని పేర్కోన్నారు. అంతకుముందు చేసిన ట్విట్ లో రాష్ట్ర హితం కోసం తాను కోర్టులకైనా, జైలుకైనా వెళ్లేందుకు సిద్దమన్నారు. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని పవన్ అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan  twitter  janasena  AP TDP MPs  parliament members  

Other Articles