ys jagan takes on TDP government from the dias of samsra deeksha in mangalagiri

Ys jagan slams chandrabau over ap special status

ys jagan slams chandrabau over ap special status, jagan takes on TDP government from the dias of samsra deeksha in mangalagiri, ap cm chandrababu, ys jagan, TDP government, samsra deeksha, mangalagiri, Y S Jagan mohan reddy, samara deeksha, andhra pradesh government, ap special status, ycp deeksha

opposition party leader ys jagan takes on TDP government and chandrababu from the dias of samsra deeksha in mangalagiri

ప్రత్యేకహోదా రానప్పుడు కేంద్రంలో మంత్రులెందుకు...?

Posted: 06/03/2015 08:45 PM IST
Ys jagan slams chandrabau over ap special status

ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు గట్టిగా నిలదీయడం లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రానప్పుడు టీడీపీ ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవులు ఎందుకని నిలదీశారు. ప్రత్యేక హోదా అన్న పదం విభజన చట్టంలోకి చేర్చకముందే ఓటు వేసి రాష్ట్రాన్ని విడగొట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి నిరసనగా ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో సమరదీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజధాని కోసం భూములు లాక్కోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. చంద్రబాబుపై పోరాటానికి ఈ దీక్షే వేదికవుతుందన్నారు. మండుటెండను ఖాతరు చేయకుండా వేలమంది దీక్షకు సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాలుపంచుకుంటే.. చంద్రబాబుకు మాత్రం తాము దీక్ష ఎందుకు చేపట్టామో తెలియదన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఎండగట్టడంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందేకే తాము దీక్షను చేపట్టానని ఆయన అన్నారు.

ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంతో  పాటు, జాబులు, నిరుధ్యోగ భృతి, డ్వాక్రా రుణాల మాఫీ, ఆడపడచులు పరిరక్షణ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అనేక హామీలను ఇచ్చారని ఇవి కాకుండా.. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని కూడా హామీలు గుప్పించారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు  ఇచ్చిన మాటలు ఏమిటీ... ఎన్నికల తర్వాత చంద్రబాబు చేస్తున్నది ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. రైతున్నలు చంద్రబాబు మాటలు నమ్మి ఓటు వేశారని అయితే అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను బాబు గాలికి వదిలేశారన్నారు. ప్రస్తుతం రైతన్నలు పడుతున్న అవస్థలు, అగచాట్లు అన్ని ఇన్నీ కావని, చివరకు వారు ఆత్మహత్యలు  చేసుకునే వరకూ పరిస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ డ్వాక్రా అక్కచెల్లెమ్మలను పట్టపగలు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles