Talanasi Srinivas | Muncipal workers | Congress | Janareddy | Uttam kumar, KCR

Tasani srinivas fo you have the all answers

Talanasi Srinivas, Muncipal workers, Congress, Janareddy, Uttam kumar, KCR

Tasani Srinivas fo you have the all answers. Talasani suggest the congress leeaders to quit the political dramas.

చిల్లర రాజకీయలు చేస్తున్నారా.? తలసాని..?

Posted: 07/17/2015 01:12 PM IST
Tasani srinivas fo you have the all answers

మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మెరుపు సమ్మె నిర్వహించారు. తెలంగాణ సెక్రటేరియట్ ముందు మెరుపు సమ్మెతో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, దానం నాగేందర్, పొన్నాలతో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. వెంటనే మున్సిపల్ ఉద్యోగుల జీతాలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల జీతాలను పెంచుతామని, కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం మాట మార్చారని వారు అంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని స్పందించారు. కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ధర్నా మీద తలసాని పెదవి విరాచారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ వారికి సూచించారు.

Also Read:  తలసాని శ్రీనివాస్ మంత్రి పదవి ఊస్ట్..?
Also Read:  తలసానికి సాలిడ్ షాక్.. సంబరాల్లో టిటిడిపి

తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగులకు 47శాతం జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుందని అయినా కాంగ్రెస్ వారు ధర్నా నిర్వహించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ధర్నా ఎందుకు చేస్తున్నారో కూడా తెలియనంతలా ధర్నా నిర్వహించడం ఏంటని మండిపడ్డారు. అయితే కేసీఆర్ గారి గురించి మాత్రం బాగానే చెప్పుకొచ్చారు తలసాని. గతంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచారని.. దానికి కార్మికులు ఎంతో సంతోషంగా ఉన్నారని తలసాని అన్నారు. అయితే అడిగింది అందరికి అయితే హైదరాబాద్ లో పని చేస్తున్నకార్మికులకు మాత్రమే జీతాలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద తలసాని వివరణే ఇవ్వలేదు.

Also Read:  మంత్రి తలసాని వార్నింగ్ పై కోపగించుకున్న కవిత..
Also Read:  అయ్య బాబోయ్.. తలసానికి కోపం వచ్చింది

తలసాని వీటికి కూడా సమాధానాలు చెప్పవా..
* తలసాని.. మీరు చిల్లర రాజకీయాలు చెయ్యొద్దు అని అనడానికి అర్హత ఉందా.?
* కాంగ్రెస్ నాయకులు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియనంతగా ధర్నా నిర్వహించారా..? మరి మీరు మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో...? ఎందుకు మాట్లాడారో తెలుసా..?
* జీతాలు పెంచండి బాబూ అంటూ మున్సిపాలిటీ కార్మికులు ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా అప్పుడెందుకు మాట్లాడలేదు...? ఇప్పుడెందుకు మాట్లాడారు..?
* మున్సిపల్ కార్మికులు అందరికి జీతాలు పెంచాలని ధర్నాచెస్తుంటే హైదరాబాద్ లొ పని చేస్తున్న వారికి మాత్రమే జీతాలు పెంచితే సరిపోతుందా..?
* కొంత మంది కార్మికులకు పెంచి మరి కొంత మందికి మాత్రం పెంచకపోవడం విభజించు పాలించు పాలసీనా కాదా.?

By Abhinavachary

 

Also Read:  టాలీవుడ్ లో ఎవరికీ.. తలసాని వార్నింగ్..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Talanasi Srinivas  Muncipal workers  Congress  Janareddy  Uttam kumar  KCR  

Other Articles