Monkey | Squirrel | Police | Garman police | Rat

Cases filed aganist the squirrel and monkey

Monkey, Squirrel, Police, Garman police, Rat

Cases filed aganist the squirrel and monkey. An aggressive squirrel was 'arrested' by the German police after a woman complained that the rodent was following her around

అమ్మాయి వెంటపడ్డ ఉడత.. దొంగతనం చేసిన కోతి

Posted: 07/17/2015 03:07 PM IST
Cases filed aganist the squirrel and monkey

అమ్మాయిల వెంట అబ్బాయిలేంటి..? ఉడుతలు కూడా పడతాయ్ అని జపాన్ పోలీసులు అంటున్నారు. ఇలాంటి విచిత్రమైన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది.  మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ ఉడుతను అరెస్టు చేశారు. ఇందులో ఉడుత చేసిన నేరం ఏంటంటే.. ఆ మహిళ వెంటపడి వేధించడమే. జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని బోట్రాప్ నగరంలో సదరు మహిళ వీధిలో వెళుతుండగా ఓ ఉడుత వెంటపడింది. ఎంత అదలించినా పోలేదు. ఆమె చుట్టూ తిరుగుతూ.. తెగ ఇబ్బంది పెట్టేసింది. దీంతో, ఆ మహిళ చివరకు ఎమర్జెన్సీ కాల్ చేసింది. కాల్ అందుకున్న ఓ పోలీసు అధికారి వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఆ ఉడుతను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఆ ఉడుతను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నామని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు పోలీసులు. ఇక, పీఎస్‌లో ఆ ఉడుతకు ఓ ఆఫీసర్ మేత పెడుతున్న దృశ్యాలతో కూడిన వీడియోను ఫేస్ బుక్‌లో పెట్టారు. ఆ ఉడుత బాగా అలసిపోయినట్టు కనిపిస్తోందని, శక్తి పుంజుకున్నాక దానిని రెస్క్యూ హోంకు తరలిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Also Read:  మీకు తెలుసా.. పందులు ఎగరగలవు
Also Read: రోడ్ల మీద సింహాలు, పులులు

జంతు ప్రేమికులు ఎంతలా మొత్తుకుంటున్నా కానీ జంతువుల మీద హింస తగ్గుతుందో లేదో తెలియదు కానీ తాజాగా సీన్ రివర్స్ అయింది. అందుకే ఉడతలు, కోతులు, ఎలుకల మీద కేసులు నమోదవుతున్నాయి.  ఓ ఎలుక మసీదులోకి రావడంతో అక్కడ ఉన్న మహిళల మధ్య తొక్కిసలాట జరిగింది. దాంతో ఏకంగా 80 మంది ఆస్పత్రి పాలయ్యారు. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాని పోలీసులు ఎలుక మీద కేసు నమోదు చేశారు. ఇక కాన్సూర్ లో ఓ కోతి మహిళ మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లింది. దాంతో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఆ కోతి మీద కేసు పెట్టిన పోలీసులు.. విచారణ కూడా చేపట్టారు. మొత్తానికి ఇలా జంతువుల మీద కేసులు నమోదు కావడం విశేషమే. మరి ముందు ముందు ఇంకా ఎలాంటి వింతలు చూడాల్సి వస్తుందో అని కొంత మంది అనుకుంటున్నారు.

By Abhinavachary

Also Read: హాంకాంగ్ షాపింగ్ మాల్ లో పంది సందడి
Also Read:  రేవంత్ రెడ్డి మాటలకు ఫీల్ అయిన జంతువులు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Monkey  Squirrel  Police  Garman police  Rat  

Other Articles