cine actress kavitha slams minister talasani srinivas yadav

Kavitha slams minister talasani srinivas yadav

cine actress kavitha, kavitha slams minister talasani, talsani warns Tollywood big shots, telangana minister, talasani srinivas yadav, andhra film makers, chandrababu, dasari narayan rao, rajendra prasad, Tollywood news, tollywood may day celebrations, warnings, Tollywood, big shots, maa elections

cine actress and TDP leader kavitha slams minister talasani srinivas yadav for the comments he made on may day at film chamber

మంత్రి తలసాని వార్నింగ్ పై కోపగించుకున్న కవిత..

Posted: 05/02/2015 06:06 PM IST
Kavitha slams minister talasani srinivas yadav

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని కవిత హితవు పలికారు. మే డే దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు హాజరైన మంత్రి తలసాని టాలీవుడ్ లో ఎవరి గుత్తాధిపత్యం నడవదని, ఇది ఎవరి జాగీరు కాదని, సినీ పరిశ్రమ వున్న హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం వున్నదని, ఈ విషయాన్ని కళాకారులు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అంతేకాదు. ఉదయం లేస్తూనే చంద్రబాబు ఇంటి చుట్టూ తిరిగే అలవాటు మానుకోవాలని ఆయన సభా ముఖంగా వార్నింగ్ ఇచ్చారు.

ఇంతవరకు బాగానే వున్నా.. కవితకు ఎందుకు కోసం వచ్చింది..? అసలు అమె తెలంగాణకు అనుకూలం కాదా..? అంటే అనుకూలం కాదు. ఎందుకంటే తలసానికి నోరు అదుపులో పెట్టకోవాలని హితవునిచ్చింది టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎంపీ కవిత కాదు. మరెవరనేగా మీ సందేహం. టీడీపీ నేత, సీనీనటి కవిత. హైదరాబాద్ లో సినీ కళాకారులకు కులాలు, మతాలు, ప్రాంతలు లేకుండా కలసికట్టుగా ఐక్యంగా ముందుకు సాగుతన్న క్రమంలో.. సినిమాల్లోకి రాజకీయాలను తీసుకురావద్దని సూచించారు. హితవు పలికిన కవిత.. తనలోని రాజకీయ నాయకురాలిని చాన్నాళ్ల తరువాత నిద్రలేపి.. సహజమైన రీతిలో విమర్శలు చేశారు.


టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో మంత్రి పదవి పొందిన తలసానికి చంద్రబాబు పేరెత్తే అర్హత లేదన్నారు. సనత్‌నగర్‌ సీటుకోసం బాబు కాళ్లవేళ్లా పడిన సంగతిని మర్చిపోవద్దని కవిత అన్నారు. అయితే కవిత సినిమా వాళ్ల తరుపున హితవు పలికి.. రాజకీయ నేతగా మంత్రిపై విమర్శలు చేశారు. ఇలా రెండు పడవల్లో కాలు పెట్టి.. ప్రయాణించే సినిమా వాళ్లనే మంత్రి వార్నింగ్ ఇచ్చారు తప్ప.. అందరికీ కాదని, అయినా గుమ్మడి కాయల దోంగ అంటే.. కవిత భుజాలు తడుముకోవడం ఎందుకని పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా విమ్శలు గుప్పిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kavitha  talasani srinivas yadav  warnings  Tollywood  big shots  

Other Articles