Governor | Talasani Srinivas | Minister | KCR | Telangana govt | TDP, mahusudhana chary, President

Governor suggested to speaker madhusudhanachary to take action on talasani srinivas

Governor, Talasani Srinivas, Minister, KCR, Telangana govt, TDP, mahusudhana chary, President

Governor suggested to Speaker Madhusudhanachary to take action on Talasani Srinivas. TDP leaders complaints to President on Talasani.

తలసాని శ్రీనివాస్ మంత్రి పదవి ఊస్ట్..?

Posted: 07/11/2015 08:59 AM IST
Governor suggested to speaker madhusudhanachary to take action on talasani srinivas

తెలుగుదేశం పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలోకి చేరి మంత్రి పదవిని పొందిన తలసాని  శ్రీనివాస్ మీద వేటు వెయ్యాలని తెలుగుదేశం పార్టీ తీవ్ర వత్తిడి చేస్తోంది. అయితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తలసాని అంటున్నారు. కానీ స్పీకర్ మాత్రం దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. దీని మీద ఫిర్యాదు చేస్తు తెలుగుదేశం పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా రాష్ట్రపతిని కలిశారు. అయితే స్పీకర్, గవర్నర్ ఇద్దరూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి వంతపాడుతున్నారని మండిపడుతున్నారు. అయితే టిడిపి నాయకుల వత్తిడి, రాష్ట్రపతికి ఫిర్యాదు చెయ్యడం లాంటి పరిణామాలు తలసానికి గండం తెచ్చిపెడుతున్నాయి. గవర్నర్ తలసాని మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సూచించారని అలా కాని పక్షంలో తానే చర్యలకు సిద్దపడాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్లు సమాచారం. మొత్తానికి తలసాని విషయంలో ఏదో జరగబోతోంది అన్నది మాత్రం వాస్తవం.

Also Read:  టీడీపీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రా..!? తలసానికి గండం

వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పదవిపై త్వరలో స్పష్టత రానుంది. ఆయన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదింపజేయించాలా? మంత్రి పదవి నుండి తొలగించాలా? అనేది ప్రభుత్వం తేల్చుకోనుంది. లేకుంటే ఈ విషయంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణిని అవలంబిస్తే గవర్నర్‌ నరసింహన్‌ ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఆయన్ను మంత్రివర్గం నుండి బర్తరఫ్‌ చేయమని ప్రభుత్వానికి సూచించనున్నారని సమాచారం. తలసాని విషయంలో రాష్ట్రపతి కార్యాలయం, కేంద్రహౌంశాఖల నుండి అడుగుతున్న నేపథ్యంలో గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఏ పార్టీ తరపున గెలిచారు, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన రాజీనామా చేశారా లేదా.. ఆరునెలలైనా రాజీనామా ఆమోదం పొందకుండా ఆలస్యం ఎందుకు జరిగింది. ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారని . మీరు తీసు కోకుంటే సొంతంగా నేనే నిర్ణయం తీసుకుంటానని గవర్నర్‌ నరసింహన్‌ స్పీకర్‌ మధుసూదనాచారికి చెప్పినట్లు తెలిసింది.

Also Read:  బౌన్సర్ గా పనిచేసినోడు విమర్శలు చేస్తున్నాడు..

స్పీకర్‌ నిర్ణయ తీసు కోకుంటే, తలసానిని మంత్రివర్గం నుండి బర్తరఫ్‌ చేయమని ప్రభుత్వానికి గవర్నర్‌ సూచించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇతర పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా ఆమోదం పొందకుండా ఆరునెలలుగా మంత్రివర్గంలో కొనసా గడం మంచి సంప్రదాయం కాదని గవర్నర్‌ ప్రభుత్వానికి తెలియజేయ నున్నారని తెలిసింది. అయితే ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదించి, ఆ తర్వాత మంత్రిగా కొనసాగించనున్నారని తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల తర్వాత తలసాని సనత్‌నగర్‌ నియోజకవర్గ ఉపఎన్నికల్లో పోటీ చేయనున్నారని సమాచారం.

Also Read:  ఫోన్ ట్యాప్‌ చేయాల్సిన ఖర్మ మాకు లేదు.. అది చంద్రబాబు ఆలోచన

టిడిపి తరపున సనత్‌నగర్‌ నుండి గెలిచిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరి కెసిఆర్‌ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. దీనిపై టిడిపి, కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వినతి పత్రాలు అందించాయి. కేంద్రహౌంశాఖకు ఫిర్యాదు చేశాయి. ఈ విష యంలో గవర్నర్‌ పదవి నుండి నరసింహన్‌ను తప్పించాలని కాంగ్రెస్‌పార్టీ నేత శశిధర్‌రెడ్డి రాష్ట్రపతికి తెలియజేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపైనా కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. అయితే తలసానిని మంత్రివర్గంలో తీర్చుకోవడం పైనే రాష్ట్రపతి, కేంద్రహౌంశాఖ సీరియస్‌ అయ్యారని తెలిసింది. తనకందిన వినతులపై ఢిల్లీ వెళ్లిన తర్వాత రాష్ట్రపతి గవర్నర్‌కు తెలియజేసినట్లు సమాచారం. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం, కేంద్రహౌంశాఖ కార్యాలయం ఆదేశించడంతో గవర్నర్‌ పైవిధంగా స్పందించారని సమాచారం. ఈ నెల 14 తర్వాత సిఎం కెసిఆర్‌ ఢిల్లీకి వెళ్లతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

By Abhinavachary

Also Read:  బీజేపీ ఎమ్మెల్యేలది చిల్లర రాజకీయం : తలసాని
Also Read:  ఆ ముగ్గురి మీద కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  Talasani Srinivas  Minister  KCR  Telangana govt  TDP  mahusudhana chary  President  

Other Articles