Godavari Pushkaralu | Bhadrachalam | Godavari dists | Priests

Difficulties for the devotees wha are going to godavari puskaralaku

Godavari Pushkaralu, Bhadrachalam, Godavari dists, Priests

Difficulties for the devotees coming Godavari puskaralaku. In Bhadrachalam Priests are in strike for solve their problems. Travelliing problems in the Godavari dists.

పుష్కరాలకు వెళ్లే భక్తులారా.. గమనించండి

Posted: 07/16/2015 10:27 AM IST
Difficulties for the devotees wha are going to godavari puskaralaku

గోదావరి మహా పుష్కరాలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. మూడో రోజు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో పుష్కర స్నానాలు చేస్తున్నారు. అయితే పుష్కరాలకు వస్తున్న భక్తులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. పుష్కరాలకు వచ్చే యాత్రికులకు పుణ్యం మాట ఎలా ఉన్నా పుష్కర ఘాట్లకు వచ్చి వెళ్ళాలంటే మాత్రం వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. వాహనాలను సుదూర ప్రాంతంలో నిలిపేయడం, అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ఘాట్లకు వెళ్లాల్సి రావడం, స్పెషల్ బస్సుల సమాచారం తెలియకపోవడంతో భక్తుల కాళ్లకు పని తప్పడంలేదు. ఉచిత బస్సు సర్వీసుల పేరుతో అధికారులు తమను మోసగించారని భక్తులు లబోదిబోమంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని పుష్కరఘాట్లకు భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. పుష్కర స్నానాలకు వచ్చే యాత్రికులకు 300 బస్సులను నడిపిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ఆర్టీసీ ఆదిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

Also Read:  పుష్కరాలకు వెళ్లే వాళ్లూ జాగ్రత్త.. ఇవి పాటించండి

ఏలూరు, విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలకు కొవ్వూరుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్కరనగర్ వద్ద పార్కింగ్-కు అనుమతిచ్చారు. తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురం వైపు నుంచే వెహికిల్స్ ను రోడ్ కం రైల్వే బ్రిడ్జి వద్ద పార్కింగ్ చేయాలని నిబంధనలు విధించారు. ఈ రెండు చోట్ల నుంచి ఉచిత బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేశామంటున్నారు అధికారులు. అయితే ఫ్రీ బస్సుల వివరాలు తెలియకపోవడంతో యాత్రికులకు ఇబ్బందులు తప్పడంలేదు. మండే ఎండల్లో పిల్లాపాపలతో ఘాట్ల వద్దకు చేరుకునేందుకు భక్తులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా ఉచిత బస్సు సర్వీసుల వివరాలు అందరికీ తెలిసేలా ఏర్పాట్లు చేయాలని పుష్కర భక్తులు కోరుతున్నారు.

Also Read: మహా పుష్కరాల్లో మహా విషాదం.. తొలి రోజే అపశృతి
Also Read:  విషాదం తీవ్రంగా కలిచి వేసిందంటూ పవన్ ట్వీట్..

ఇక భద్రాచలంలో అర్చకులు పిండ ప్రధానం చెయ్యకుండా ఆందోళనకు దిగారు. తమకు ప్రత్యేకంగా ఘాట్ లు కేటాయించారని పోలీసులు పిండ ప్రధానం చెయ్యకుండా అడ్డుకుంటున్నారని వారు ఆందోళనకు దిగారు. తమ కోసం ప్రత్యేకంగా ఘాట్ లను కేటాయించడంతో పాటు, భక్తులను అక్కడికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గోదావరి పుష్కరాల సందర్భంగా తమ పూర్వికులకు పిండ ప్రధానం చెయ్యాలని వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి అర్చకుల సమస్యలను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

By Abhinavachary

Also Read:  క్యు లైన్లో భక్తులు.. నిన్నటి ఘటనతో జాగ్రత్తలు
Also Read:  దారులన్నీ గోదారికే.. తొలిరోజే 24 లక్షల మంది పుష్కర స్నానం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari Pushkaralu  Bhadrachalam  Godavari dists  Priests  

Other Articles