Devotees | Godavari Pushkaralu | Ques | chandrababu | Police, AP, Rajahmundry

Devotees are very care by the yesterdays incident at rajahmundry and they are forming ques in their own

Devotees, Godavari Pushkaralu, Ques, chandrababu, Police, AP, Rajahmundry

Devotees are very care by the yesterdays incident at Rajahmundry and they are forming ques in their own. Devotees are very alert at the Godavari Pushkaralu by the yesterdays incident.

క్యు లైన్లో భక్తులు.. నిన్నటి ఘటనతో జాగ్రత్తలు

Posted: 07/15/2015 01:38 PM IST
Devotees are very care by the yesterdays incident at rajahmundry and they are forming ques in their own

గోదావరి మహా పుష్కరాలు చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలంటారు.. పుణ్యస్నానం చెయ్యలంటే ఎంతో అదృష్టం ఉండాలంటారు. అందుకే గోదావరి మహా పుష్కరాలు ప్రారంభం కాగానే జనం గోదావరికి పోటెత్తారు. అటు ఏపి, ఇటు తెలంగాణలలో ఒక్కరోజే 24 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారంటే పరిస్థితి ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే గోదావరి పుణ్యస్నానానికి వచ్చి తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం సర్వత్రా విషాదం నింపింది. అయితే రాజమండ్రి కోటిలింగాల పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కసలాటలో 27 మంది మృతి చెందడం సంచలనం రేపింది. అయితే గోదావరి పుష్కరాలకు వస్తున్న భక్తజనం భద్రతకు మరింత పోలీసులను, అధికారులకు నియమించాయి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జరిగిన ఘటన భక్తుల్లో మార్పు తీసుకువచ్చింది.

Also Read:  పుష్కరాలకు వెళ్లే వాళ్లూ జాగ్రత్త.. ఇవి పాటించండి
Also Read:  దారులన్నీ గోదారికే.. తొలిరోజే 24 లక్షల మంది పుష్కర స్నానం

గాయం తగిలితే కానీ కట్టు కట్టరు అని సామెత. ముందు జాగ్రత్తలు పాటించండి బాబూ అంటూ పుష్కరాల సమయంలో అధికారులు ఎన్ని జాగ్రత్త పాఠాలు నేర్పించినా కానీ భక్తులు మాత్రం పాటించలేదు. ఒక్కసారిగా లక్షల జనం పుష్కరఘాట్ లకు చేరుకోవడం.. చిన్న పిల్లలు, ముసలివారు కూడా అందులో ఉండటంతో తొక్కిసలాట జరిగి మృతుల సంఖ్య పెరిగింది. అయితే నిన్నటి ఘటనతో గోదావరి మహా పుష్కరాలకు వస్తున్న భక్తులు అలర్ట్ అయ్యారు. పూర్తి జాగ్రత్తలతో పుష్కరాలకు హాజరవుతున్నారు. పోలీసుల ప్రమేయం లేకున్నా కానీ క్యు లైన్లలో వెళ్లి పుష్కర ఘాట్ వద్ద పుణ్య స్నానం చేస్తున్నారు. నిన్నటి ఘటనతో వచ్చే భక్తులు పూర్తి స్థాయి అప్రమత్తతో ఉంటున్నారు. అవసరమైతే కొంచెం ఆలస్యమయినా వేచి ఉండి తీరిగ్గా రద్దీ తగ్గిన తర్వాత పుష్కరాలకు హాజరవుతున్నారు.

By Abhinavachary

Also Read:  మా తల్లి గోదారి పిలుస్తోంది.. పుష్కరాలొచ్చె సంబరాలు తెచ్చె
Also Read:  ప్రభుత్వ నిర్లక్షం, అధికారుల అలసత్వం.. బలైంది భక్తులు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devotees  Godavari Pushkaralu  Ques  chandrababu  Police  AP  Rajahmundry  

Other Articles