AP | Deficit | Budget | Central govt | five thousand crores| Chandrababu, Arun Jaitly, Modi

Ap govt wrote a letter to central govt to release five thousasnd crores

AP, Deficit, Budget, Central govt, five thousand crores, Chandrababu, Arun Jaitly, Modi

Ap Govt wrote a letter to central govt to release five thousasnd crores. Ap govt propose te\wenty three tousand crores to fill the deficit but central govt released only threefifty crore rupees.

అప్పుల్లో ఉన్నాం.. ఐదు వేల కోట్లు కావాలని కేంద్రానికి ఏపి ప్రభుత్వం లేఖ

Posted: 07/16/2015 08:57 AM IST
Ap govt wrote a letter to central govt to release five thousasnd crores

ఉమ్మడి ఏపిని రెండు రాష్ట్రాలు విభజించిన తర్వాత ఏపి ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. తెంలగాణ రాష్ట్రంలో బడ్జెట్ మిగులు ఉంటే, ఏపిలో మాత్రం లోటు బడ్జెట్ ఉంది. అయితే విభజన చట్టంలో భాగంగా లోటు బడ్జెట్ ను పూడ్చడానికి కావాలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఉంది. కాబట్టి తాజాగా ఏపి ప్రభుత్వం తమకు ఐదువేల కోట్ల రూపాయలు అవసరమని కేంద్రానికి లేఖ రాసింది. అయితే ప్రత్యేక హోదా సంగతి తర్వాత కానీ ఏపికి కావలసినన్ని నిధులను కేంద్రం విడుదల చెయ్యడానికి సిద్దంగా ఉంది అని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రితో సహా పలువురు మంత్రులు వెల్లడించారు. గతంలో చేసిన ప్రతిపాదనలకు కూడా కేంద్రం అనుకూలంగా స్పందించింది. కానీ నిధుల విడుదల విషయంలొ మాత్రం మొండిచెయ్యే చూపిస్తూ వచ్చింది కేంద్రం. మరి తాజా లేఖ మీద కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read:  విభజించిన కేంద్రమే లోటుని తీర్చాలి-యనమల

తాజాగా కేంద్రానికి లేఖ రాసిన ఏపి సర్కార్ తాము తీవ్రంగా అప్పుల్లో ఉన్నామని.. ప్రస్తుతం అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని తెలిపింది. ఆ అప్పులు తీర్చాలంటే ఇప్పటి కిప్పుడు కనీసం రూ.5 వేల కోట్లు అవసరం. తక్షణమే ఆ మొత్తాన్ని విడుదల చేసి ఆదుకోండి అంటూ లేఖలో వివరించింది.  ఇదీ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న అర్జీ. రెవెన్యూ లోటు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రత్యేక ప్యాకేజీ, సీఎస్టీ బకాయిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 24,500 కోట్లు ఇవ్వాల్సిందిగా గతేడాది కేంద్రాన్ని కోరగా.. ఈ మొత్తంలో కేవలం 350 కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకొంది. కేంద్రం చర్యలతో ఏమీ పాలుపోని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కనీసం ఐదు వేల కోట్లయినా విడుదల చేయాలని తాజాగా విజ్ఞప్తి చేసింది. గతంలో 24,500 కోట్లు అడిగితే.. కేవలం 350 కోట్లు ఇచ్చిన కేంద్రం చర్యలతో అవాక్కయిన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ, రెవెన్యూ లోటు గురించి కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది.

Also Read:  నవ్యాంధ్ర ప్రత్యేక ప్యాకేజీని అన్ని రాష్ట్రాలతో పొల్చవద్దు..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతోనూ భేటీ అయ్యారు. సీఎంతో పాటు రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నిధుల విడుదల కోసం ఢిల్లీలో పడిగాపులు కాచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. 350 కోట్లు మినహా ఒక్క పైసా విదిలించలేదు. కాగ్‌ నివేదికలు వచ్చిన తర్వాత రెవెన్యూ లోటుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. కాగ్‌ నివేదిక వచ్చి కూడా రెండు నెలలు దాటిపోయింది. ఏపీ రెవెన్యూ  లోటు 17 వేల కోట్లు ఉంటుందని కాగ్‌ సైతం కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఇంత వరకూ దీనిపై కేంద్రం నోరెత్తడం లేదు. మరి కనీసం ఐదు వేల కోట్ల రూపాయలను విడుదల చేసి మమ్మల్ని ఆదుకోండి అన్న ఏపి సర్కార్ మొర కేంద్రం ఆలకిస్తుందో లేదో..?

By Abhinavachary

Also Read:  నవ్యాంధ్ర రాష్ట్రానికి రూ. 3 వేల కోట్లు.. భరోసా ఇచ్చిన కేంద్రం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Deficit  Budget  Central govt  five thousand crores  Chandrababu  Arun Jaitly  Modi  

Other Articles