KCR | Yadadri | Narasimha Swamy Temple | Yadagiri Gutta

Telangana cm kcr order to start works for yadadri within ten days

Telangana, KCR, Yadadri, Narasimha Swamy Temple, Yadagiri Gutta

Telangana cm KCR order to start works for Yadadri within ten days. KCR conduct a review meeting on Yadadri and he discuss about the renovation of Yadadri Temple.

ఇక యాదాద్రికి శ్రీకారం చుట్టండి: కేసీఆర్

Posted: 07/16/2015 08:31 AM IST
Telangana cm kcr order to start works for yadadri within ten days

తెలంగాణలొ తిరుపతిలాగా యాదాద్రిని రూపుదిద్దేందుకు కేసీఆర్ ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పటికే యాదాద్రి రూపురేఖలను మారుస్తూ.. కొత్త రూపు సంతరించుకునేలా తయారుచేసిన ప్లాన్ సిద్దంగా ఉంది. నిధులు కూడా విడుదల చేసింది తెలంగాణ సర్కార్. దాదాపు వెయ్యి ఎకరాల భూమిని యాదాద్రికి కేటాయిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. ఇక అన్నీ సమకేరిన నేపథ్యంలో పనులను ప్రారంభించడానికి ముందుకు రావాలని కేసీఆర్ సూచించారు. యాదాద్రి మీద ముందు నుండి ప్రత్యేక దృష్టిసారించిన కేసీఆర్ తాజాగా మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Also Read:  ఏడుకొండలను తలపించేవిధంగా యాదాధ్రి.. కార్పోరేట్ల విరాళం

వారం పదిరోజుల్లో యాదాద్రి అభివృద్ధి పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బడ్జెట్‌లో కావలసినన్ని నిధులతో పాటు వెయ్యి ఎకరాల భూమి కూడా సమకూరినందున ఇక పనులను ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో దాదాపు ఐదు గంటలపాటు యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి ప్రణాళికలపై ఆయన సమీక్ష నిర్వహించారు.ఐదెకరాల విస్తీర్ణంలో ప్రధానాలయ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మికం, అహ్లాదం, ఆనందం, పచ్చదనం వెల్లివిరిసే ప్రాంతంగా యాదగిరిగుట్టను రూపుదిద్దాలని సీఎం నిర్దేశించారు.

Also Read:  యాదగిరి కాదు ఇకపై యాదాద్రి

యాదాద్రి అభివృద్ధి కోసం పుష్కలంగా నిధులున్నాయని సీఎం చెప్పారు. వరుసగా రెండు బడ్జెట్లలో ఇప్పటికే రూ. 200 కోట్లు కేటాయించామని, టాటా, అంబానీ, జెన్కో, భెల్ లాంటి సంస్థలుకూడా సుమారు రూ. 500 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. యాదాద్రి చుట్టూ 943.2 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, మరో 100 ఎకరాలను సేకరిస్తామని తెలిపారు. అధికారులు వెయ్యి ఎకరాల స్థలాన్ని జోనింగ్‌చేసి, లే అవుట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. యాదాద్రి గుట్టపై 15 ఎకరాల స్థలం ఉందని, దీనితో 5 ఎకరాలు ప్రధాన గుడి కిందకు వస్తాయని సీఎం చెప్పారు. ఈ ఐదెకరాల్లో ప్రాకారం, మాడ వీధులు నిర్మించాలని సూచించారు. లక్ష్మీ నరసింహస్వామి 32 అవతారాల ప్రతిమలు కూడా ఇందులోనే రావాలన్నారు.

Also Read:  నరసింహుడి భక్తులకు కేసీఆర్ చుక్కలు చూపుతున్నారు

యాదాద్రి కింది భాగంలో బస్టాండ్, కళ్యాణమంటపం, షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మించాలని సీఎం ఆదేశించారు.అలాగే పూజకు వినియోగించే పూలచెట్లతో కూడిన స్వామివారి ఉద్యానవనం, మండల దీక్షలు తీసుకునే వారికోసం వసతి కేంద్రాలు నిర్మించాలి. యాదాద్రి చుట్టూ ఉన్న ఇతర కొండలు, ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనాలు, కాటేజీలు, గెస్ట్‌హౌజ్‌లు, పార్కింగ్ ప్లేస్‌లు, గోశాల, అన్నదానం కోసం భోజనశాల, పర్మినెంట్ హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.యాదాద్రి సమీపంలోని బస్వాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని, అక్కడ బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెరువుకట్టను ట్యాంక్‌బండ్ మాదిరిగా తీర్చిదిద్దాలన్నారు. యాదగిరిగుట్ట ప్రాంతమంతా నాలుగులైన్ల రోడ్లు వేయాలని, ప్రతి రోడ్డుకు డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, మధ్యలో ఐలాండ్స్ నిర్మించాలన్నారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  KCR  Yadadri  Narasimha Swamy Temple  Yadagiri Gutta  

Other Articles